Water In Petrol : వార్నీ.. పెట్రోల్‌ కొట్టిస్తే నీళ్లు వచ్చాయి.. షాక్‌లో వాహనదారులు

పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. కొందరు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని బయలుదేరారు. అయితే, కాసేపటికే వాహనాలు ఆగిపోవడంతో కంగుతిన్నారు. మెకానిక్ షాపులకు పరుగులు తీశారు. అక్కడ అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. బండిలో పెట్రోల్ కి బదులు నీళ్లు ఉండటాన్ని చూసి కంగుతిన్నారు.

Water In Petrol : వార్నీ.. పెట్రోల్‌ కొట్టిస్తే నీళ్లు వచ్చాయి.. షాక్‌లో వాహనదారులు

Water In Petrol : వాహనదారులు ఆ పెట్రోల్ బంకుకి వెళ్లి తమ వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకున్నారు. కొందరు ట్యాంక్ ఫుల్ గా పెట్రోల్ పోయించుకున్నారు. హమ్మయ్య ఇక భయం లేదు ఎంతదూరమైన ప్రయాణం చేయవచ్చని భావించారు. కట్ చేస్తే.. పెట్రోల్ బంక్ దాటి కొంచెం దూరం వెళ్లగానే బండి ఆగిపోయింది. అస్సలు స్టార్ట్ కావడం లేదు. అదేంటి.. ఇప్పుడేగా పెట్రోల్ కొట్టించాం, మరి ఎందుకు ఆగిపోయిందబ్బా అని డౌట్ వచ్చింది. అంతే.. మెకానిక్ దగ్గరికి పరుగులు తీశారు. అక్కడ అసలు విషయం తెలిసి వాహనదారులు కంగుతిన్నారు. తాము కొట్టించుకున్నది పెట్రోల్ కాదు నీళ్లు అని తెలిసి లబోదిబోమన్నారు.

గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరులోని కేజీఎస్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఆ బంకులో పెట్రోల్ కి బదులుగా నీళ్లు వస్తున్నాయి. దీంతో వాహనదారులు మండిపడుతున్నారు. అప్పుడే పెట్రోల్ నింపుకుని వెళ్లినా కాసేపటికే బైకులు ఆగిపోవడంతో కంగుతిన్నారు. అంతా మెకానిక్ షాపులకు పరుగులు తీశారు.

Fight in Petrol Bunk: పెట్రోల్ బంక్ యజమానిపై కత్తితో దాడి చేసిన యువకుడు

తీరా చూస్తే పెట్రోల్ బదులు నీళ్లు పోయడంతోనే బైక్ ఆగిపోయినట్లు తెలిసి వాహనదారులు షాక్ అయ్యారు. బంకు సిబ్బందిని నిలదీశారు. దీంతో జరిగిన తప్పిదం తెలుసుకున్న సిబ్బంది వాహనదారులకు క్షమాపణ చెప్పారు. బైక్ రిపేర్లకు అయ్యే ఖర్చుని భరిస్తామని చెప్పడంతో అంతా శాంతించారు. ప్రస్తుతానికి బంకులో పెట్రోల్ పోయడం నిలిపేశారు.

కేజీఎస్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం వాహనదారులు 10 మంది వరకు పెట్రోల్ కొట్టించుకున్నారు. బంకు నుంచి వెళ్లిపోయారు. అయితే, కాసేపటికే మార్గమధ్యలో వాహనాలు ఆగిపోవడంతో తిప్పలు పడ్డారు. మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించగా దిమ్మతిరిగే విషయం తెలిసింది. బండిలో పెట్రోల్ కి బదులు వాటర్ ఉండటాన్ని చూసి విస్తుపోయారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వాహనదారులు తిరిగి పెట్రోల్ బంకుకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. ఖాళీ బాటిల్, బకెట్లలో పట్టి చూడాలని వాహనదారులు పట్టుబడటంతో అసలు విషయం వెలుగుచూసింది. పెట్రోల్ లో సగానికి పైగా నీళ్లే వచ్చాయి. ఈ వ్యవహారంపై పెట్రోల్ బంక్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పెట్రోల్ లో ఎలాంటి కల్తీ చేయలేదంది. వర్షాల వల్ల నీరు పెట్రోల్ ట్యాంకుల్లో కలిసిపోయి ఇలా జరిగి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు.