CM KCR assembly : గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నర వేల ఇళ్లు నిర్మిస్తున్నాం : సీఎం కేసీఆర్

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

CM KCR assembly : గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నర వేల ఇళ్లు నిర్మిస్తున్నాం : సీఎం కేసీఆర్

Cm Kcr Assembly

houses For the expatriates of Gandimalla : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల సంఖ్య పెంచామని చెప్పారు. కరోనాపై కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గణనీయంగా రేషన్ కార్డులు పెంచామన్నారు. పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 39.36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచామన్నారు. భూసేకరణ రేట్లు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని స్పష్టం చేశారు. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ నిర్మిస్తున్నామని చెప్పారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ను అడ్డుకునేందుకు కోర్టుల్లో 300కు పైగా కేసులు వేశారని తెలిపారు.

గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నర వేల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు అనేక విషయాల్ని సభ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సెక్రటేరియట్ లోని ప్రార్థనా మందిరాన్ని అక్కడే పునర్ నిర్మిస్తామని చెప్పారు.