CM KCR: న్యాయశాఖకు పెద్దపీట వేస్తున్నాం.. సీజేఐ కృషితోనే ఆ సమస్య పరిష్కారమైంది..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖకు పెద్దపీట వేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సు....

CM KCR: న్యాయశాఖకు పెద్దపీట వేస్తున్నాం.. సీజేఐ కృషితోనే ఆ సమస్య పరిష్కారమైంది..

CM KCR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖకు పెద్దపీట వేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని, అన్ని జిల్లాల్లోనూ సమీకృత కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. రాష్ట్ర న్యాయ వ్యవస్థ, పరిపాలనా విభాగంలో కూడా గొప్పగా ముందుకెళ్లాలని ప్రబలంగా ఆకాంక్షిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

CJI NV Ramana : సీఎం కేసీఆర్ న్యాయయవ్యవస్థకు మిత్రుడు.. : జస్టిస్ ఎన్వీ రమణ

జిల్లా కోర్టులకు నూతన భవనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ తెలిపారు. 1730 అడిషనల్ పోస్టులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు 4,348 పోస్టులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 1.50కోట్ల ఎకరాల భూములను డిజిటలైజేషన్ చేశామని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో హైకోర్టు న్యాయమూర్తులకు భవనాలు నిర్మిస్తున్నామని, 42 మంది జడ్జిలకు దుర్గం చెరువు ప్రాంతంలో 30ఎకరాల్లో భవనాలు నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించుకోవటం జరిగిందని, న్యాయశాఖ‌లో డిస్పోసల్ ల్యాండ్స్‌ను వెంటనే పరిష్కరించాలని న్యాయ‌మూర్తులను సీఎం కేసీఆర్ కోరారు.

CJI NV Ramana : వాఘా బోర్డ‌ర్‌ను సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ రికార్డు

సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ ఉండటం గర్వకారణమని, ఆయన ఆశీస్సులు, మద్దతు ఎల్లవేళలా ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంపుపై కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశానని కేసీఆర్ గుర్తు చేశారు. అయితే ఆ అంశం పెండింగ్‌లో ఉండేదని.. సీజేఐ‌గా జస్టిస్ ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టాక ఆ సమస్య పరిష్కారం అయిందని అన్నారు. ప్రధాని, కేంద్రంతో మాట్లాడి రాష్ట్ర హైకోర్టులో బెంచీల సంఖ్య 24 నుంచి 42కి పెంచేలా సీజేఐ కృషిచేశారని కేసీఆర్ అన్నారు. అదేవిధంగా జిల్లా సివిల్ కోర్టుల్లో పనిభారం ఎక్కువగా ఉందనే సమాచారం ఉందని, ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్రను సీఎం కేసీఆర్ కోరారు.