YS Sharmila : మేము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్ షర్మిల

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు.

YS Sharmila : మేము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోం: వైఎస్ షర్మిల

YS Sharmila (2)

YS Sharmila Criticized KCR : తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తై పదో సంవత్సరం అవుతుందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయ్యిందని తెలిపారు. బంగారు తెలంగాణ అయ్యిందా? అని ప్రశ్నించారు. తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని.. ప్రతిఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు మీద పెట్టారని పేర్కొన్నారు.

రైతు రుణమాఫీ చేసేందుకు కూడా డబ్బులు లేవని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరంలో రూ.70 వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. అవినీతి సొమ్మంతా కేసీఆర్ దగ్గరే ఉందని విమర్శించారు. దేశం మొత్తం మీద ఎంపీలను గెలిపించుకుంటానని బీఆర్ఎస్ పెట్టారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని వెల్లడించారు.

Nirmal Singh : నిజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్ పాలన : నిర్మల్ సింగ్

తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. కేసీఆర్ కు బూట్లు పంపినా పాదయాత్రకు రావడం లేదని ఎద్దేవా చేశారు. బిక్షం ఇస్తున్నట్లు కేసీఆర్ బియ్యం ఇస్తున్నారని వెల్లడించారు. వరి వేసుకుంటే ఉరే అన్న సన్నాసి ఎవరని ప్రశ్నించారు. గురువారం ఆమె హైదరాబాద్ గన్ పార్క్ లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు వైఎస్ షర్మిల 10 ప్రశ్నలు సంధించారు.

రాజకీయ పార్టీల పేరులో తెలంగాణ పేరు ఉండొద్దన్నారు. బీజేపీతో కేసీఆర్ డ్యూయెట్లు పాడుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సప్లై కంపెనీగా కాంగ్రెస్ మారిందని విమర్శించారు. విలీనం చేయడానికి ఇంత కష్ట పడాల్సిన అవసరం తనకేంటని ప్రశ్నించారు. విలీనం అని ఓ మహిళ కష్టాన్ని అవమానించకండి అని అన్నారు.

Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు ఆటంకాలు.. జూన్ 2న ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా

నాడు తాను వస్తా అంటే వద్దు అనే పార్టీ ఏదైనా ఉందా? చివరికి కేసీఆర్ కూడా కాదనే వాడా? అని అన్నారు. అభ్యర్థులను తయారు చేసుకుని పోటీ చేస్తామని చెప్పారు. పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా స్పష్టం చేయాలన్నారు. తాము కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు.