Komatireddy Raj Gopal Reddy: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.

Komatireddy Raj Gopal Reddy: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పారు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పూర్తి ఫలితం వెలువడక ముందే ఆయన తన ఓటమిని అంగీకరించారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ద్వారా దాదాపు టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది.

Minor Boy: డ్రగ్స్‌కు బానిసై కుటుంబాన్నే హత్య చేసిన కుర్రాడు.. మృతదేహాల్ని బావిలో పడేసి పరారీ!

ఈ నేపథ్యంలో తన ఓటమిని అంగీకరించిన రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడులో ప్రజా తీర్పును గౌరవిస్తాం. ఈ ఎన్నికలో నైతిక విజయం మాదే. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఈ ఎన్నికలో అధర్మం గెలిచింది. డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచారు. గుర్తుల కేటాయింపు నుంచే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేసీఆర్, కేటీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పని చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మా నాయకులను, నన్ను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.

BiggBoss 6 Day 62 : గీతూ, శ్రీహాన్, రేవంత్, ఇనయాలపై ఫైర్ అయిన నాగార్జున.. వీకెండ్ ఎపిసోడ్ సీరియస్ మోడ్..

కనీసం ప్రచారం కూడా చేయనివ్వలేదు. మా పోలింగ్ ఏజెంట్లను కూడా బెదిరించారు. నవంబర్ 1 నుంచి పోలీసులు, టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. నన్ను ఓడించేందుకు కౌరవుల్లా 100 మంది ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3వ తేదీ సాయంత్రం వరకు మునుగోడులోనే ఉన్నారు. కమ్యూనిస్టులు కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.