Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

Tamilisai: కొందిరికి తాను నచ్చకపోయినప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు గవర్నర్ తమిళిసై. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు పద్మాలు వీరే

అనంతరం రాష్ట్రాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రియమైన తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాతంత్ర్యం. నిజమైన ప్రజాస్వామ్యం దేశానికి దిక్సూచి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్నారు. జాతీయ రహదారులు, రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. యువతతో కూడిన దేశం భారత్. వందేభారత్ రైలు కేటాయించినందుకు, తెలంగాణలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నిర్మించినందుకు ప్రధానికి ధన్యవాదాలు. విద్య, పరిశోధన.. అభివృద్ధికి దోహదం చేస్తాయి.

Mahesh Babu: జక్కన్న కోసం మహేష్ పూర్తి ఫోకస్‌గా ఉన్నాడు – సుధీర్ బాబు!

యువత సవాళ్లను ఎదుర్కోవాలి. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. తెలంగాణ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మన హక్కులను కాపాడుకోవాలి. కొందరికి నేను నచ్చకపోవచ్చు. అయినప్పటికీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర ఉంటుంది. నిజాయితీ, ప్రేమ, హార్డ్ వర్క్ నా బలం. కొత్త భవనాలు నిర్మించడం, ఫామ్‌హౌజ్‌లు కట్టడం మాత్రమే అభివృద్ధి కాదు. సగటు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.

తెలంగాణ అభివృద్ధి కోసం, పథకాల అమలు కోసం ప్రభుత్వాన్ని గైడ్ చేయడం నా బాధ్యత. తెలంగాణతో నాకున్న అనుబంధం మూడేళ్లు కాదు. పుట్టుకతో బంధం ఉంది. తెలంగాణలో రోజుకు 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ యువత ధైర్యంగా ఉండాలి. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం అనేక రంగాల్లో దూసుకెళ్తోంది. వైద్యం, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది’’ తమిళి సై ప్రసంగించారు.