Rains In Telangana : తెలంగాణలో రేపు,ఎల్లుండి వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది.

Rains In Telangana : తెలంగాణలో రేపు,ఎల్లుండి వర్షాలు

Rains In Telangana

Rains In Telangana :  బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది. ఈ తీవ్ర అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి మి ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది రాగల 12గంటలలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణకేంద్రం సంచాలకులు తెలిపారు.

ఇది సుమారు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరంకి చేరుకునే అవకాశం ఉంది. ఆ తరువాత సుమారు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి రేపు సాయంత్రం ఉత్తర తమిళనాడు మరియు పరిసర దక్షిణ ఆంధ్రా తీరంలోని కరైకల్ & శ్రీహరి కోట మధ్యన కడలూర్ దగ్గరలో తీరం దాటే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

Also Read : YS Sharmila : వైఎస్ షర్మిల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్

ఈ రోజు తెలంగాణలో ఈశాన్య దిశ నుండి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని..రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అక్కడ అక్కడ, మరియు ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.