వెదర్ అప్ డేట్ : తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 01:50 AM IST
వెదర్ అప్ డేట్ : తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. అక్కడక్కడ చలి గాలులు ప్రారంభమయ్యాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రదానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, దీంతో సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ..నవంబర్ 19వ తేదీ మంగళవారం మాత్రం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గత 24 గంటల్లో సిర్పూరులో 15.3 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్స్ పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గాయి. దీనికి తోడు..ఈశాన్య దిక్కు నుంచి చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. గాలిలో తేమ శాతం తక్కువగా నమోదు అవుతోందని, దీని ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్నారు. నవంబర్ 17వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. 
Read More : దూరం..కాదిక భారం : హైదరాబాద్‌లో అద్భుతమైన బ్రిడ్జి