Sharmila : షర్మిల ఏం చెప్పబోతున్నారు ? ఖమ్మంను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ?

హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్‌గూడానికి చేరుకోనున్నారు.

Sharmila : షర్మిల ఏం చెప్పబోతున్నారు ? ఖమ్మంను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ?

What Is Sharmila Going To Say Why Was Khammam Selected

Sankalpa Sabha : వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాకు చేరుకోనున్నారు. సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో నిర్వహించే సంకల్ప సభకు ఆమె హాజరుకానున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయల్దేరిన ఆమె.. ఖమ్మం శివార్లలోని నాయకన్‌గూడానికి చేరుకోనున్నారు. అనంతరం పెద్ద తండాలోని వైఎస్ విగ్రహం నుంచి.. పాదయాత్రగా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

వైఎస్ షర్మిల ఖమ్మం సభపై.. తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్ అభిమానులతో పాటు సాధారణ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన తొలి ప్రసంగంలో.. షర్మిల ఏం చెప్పబోతున్నారన్న దానిపై.. ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం సభలోనే పార్టీ పేరు, జెండాలను ప్రకటిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సంకల్పసభ పేరుతో నిర్వహించే ఈ తొలి సభకు వైఎస్‌ సతీమణి, షర్మిల తల్లి విజయలక్ష్మి హాజరవుతున్నారు.

సంకల్ప సభలో.. షర్మిల కొత్త అంశాలు చెప్పబోతున్నారు. ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కావడంతో.. సంకల్ప సభ కోసం కూడా ఈ తేదీనే ఎంచుకున్నారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టడానికి గల కారణాలు, రాజకీయాల్లోకి రావడానికి తనను ప్రేరేపించిన అంశాలపై షర్మిల తన ప్రసంగంలో స్పష్టత ఇవ్వనున్నారు. తెలంగాణలోనే ఎందుకు పార్టీ పెట్టాలనుకున్న విషయం కూడా క్లియర్‌గా చెప్పనున్నారు. తన రాజకీయ అరంగేట్రంపై.. ఇప్పటివరకు అందరిలో నెలకొన్న అనుమానాలను.. షర్మిల ఖమ్మం స్టేజ్ మీద పటాపంచలు చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో.. వైసీపీ స్థాపించినప్పుడు జగన్ కూడా.. తొలి సభ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లోనే పెట్టారు. ముందు నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి.. కడప తర్వాత ఖమ్మం జిల్లా అనువుగా ఉంటుందని.. సెంటిమెంట్‌గా కలిసొస్తుందని వాళ్లు నమ్ముతున్నారు. పైగా.. తెలంగాణలో మిగతా జిల్లాలతో పోలిస్తే.. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉంటారు. అందుకే.. ఖమ్మంను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.