PM Modi: పరేడ్ గ్రౌండ్‌కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..

హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు.

PM Modi: పరేడ్ గ్రౌండ్‌కు మోదీ ఏ సమయానికి చేరుకుంటారంటే..

Modi

PM Modi: హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ ప్రారంభమవుతుంది. ఈ సభావేదికపై మొత్తం 39మంది కూర్చోనున్నారు.

PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్లాన్

ప్రధాని మోడీతో సహా 39మంది సభ వేదికపై ఉండనున్నారు. మోడీకి ఓ వైపు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, హరియాణా, అస్సాం, కర్ణాటక, గోవా, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం. ఎల్. బిట్టర్, హిమంత బిశ్వశర్మ ,బసవరాజు బొమ్మై, ప్రమోద్ సావంత్, జయరామ్ రాగూర్, పుష్కర సింగ్ ధామి, ఎన్. బీరేన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఆశీనులు కానున్నారు.

PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని

ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు చేరుకుంటారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలో 4.30 గంటల వరకు ప్రధాని మోదీ పాల్గొంటారు. 4.30 నుండి 5.40వరకు రిజర్వ్, సాయంత్రం 5.55 గంటలకు HICC హెలిప్యాడ్ కి చేరుకుంటారు. 6.15 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 నిమిషాలకు రోడ్డు మార్గంలో పెరేడ్ గ్రౌండ్ లోని విజయ సంకల్ప సభ బహిరంగ సభా ప్రాంగణానికి మోదీ చేరుకుంటారు. 6.30 నుండి రాత్రి 7.30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.35 నుండి బహిరంగ సభ నుండి నేరుగా రాజ్ భవన్ కు వెళ్తారు. రాత్రి రాజ్ భవన్లో ప్రధాని మోదీ బస చేస్తారు. సోమవారం ఉదయం 9.20కు బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఉదయం 10.10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు.