Corona Vaccine : కరోనా వ్యాక్సిన్.. తొలి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సి నిజం

మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం... టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్కువమందిలో కలిగిన సందేహం ఇది.

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్.. తొలి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సి నిజం

Doctor Guruva Reddy Corona Vaccine

Corona Vaccine : ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనావైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. రూపాలు మార్చుకుంటున్న కరోనా సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వ్యాపిస్తూ, మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ముమ్మరంగా ప్రజలందరికి టీకాలు వేస్తోంది.




మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం… టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్కువమందిలో కలిగిన సందేహం ఇది. దీనికి ప్రముఖ డాక్టర్, సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ గురువారెడ్డి సమాధానం ఇచ్చారు.

”వాస్తవానికి.. వ్యాక్సిన్ రెండు డోసులు కచ్చితంగా తీసుకోవాలి. అలా అయితేనే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అయితే, తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే.. దాని ఉపయోగం కొంతవరకు ఉంటుంది. కానీ అది ఎంత ఉంటుంది? ఎన్నాళ్లు ఉంటుంది? అనేది ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పలేరు. కాబట్టి తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి. అప్పుడే టీకా సమర్థవంతంగా పని చేస్తుంది. దాని ఉపయోగం చాలా ఉంటుంది.



వ్యాక్సిన్ రావాలని నిన్నటివరకు దేవుడిని ప్రార్థించారు. వ్యాక్సిన్ వచ్చాక అనవసరమైన అనుమానాలతో భయపడుతున్నారు. టీకా వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, చచ్చిపోతామని భయపడుతున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కలిగే లాభాలు వంద అయితే కలిగే నష్టం ఒకటీ లేదా రెండు. కాబట్టి అందరూ కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. కరోనాకు ఏకైక మందు వ్యాక్సిన్ మాత్రమే.

కరోనా రోగం కంటే వ్యాక్సిన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనే అపోహ ప్రజల్లో ఉంది. అది చాలా తప్పు. ఆ అపోహే ఇప్పుడు నెత్తి మీదకు తెచ్చింది. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఆ అవనసర భయాలు, అనుమానాలు, అపోహలే కారణం. ప్రజల్లో అవగాహన రాహిత్యం ఈ దుస్థితికి కారణమైంది. ఇందులో ప్రభుత్వానికి కొంత బాధ్యత ఉంది.



వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా రాదని కాదు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడొచ్చు. టీకా.. ఇన్ ఫెక్షన్ ను ప్రివెంట్ చెయ్యలేదు. కానీ, ఆసుపత్రి పాలయ్యే సమస్యని, చావడాన్ని మాత్రం కచ్చితంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ ప్రాణాలను కాపాడుతుంది. ఆసుపత్రి పాలవడం లేదా ఐసీయూలోకి వెళ్లడం వంటివి జరగదు. దయచేసి వీలైనంత త్వరగా ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, మీడియా, సెలబ్రిటీలు ప్రజలను మోటివేట్ చేయాలి. వ్యాక్సిన్ తప్ప జీవితం లేదని ప్రజలను భయపెట్టాలి. అప్పుడు మాత్రమే కరోనా విపత్తు నుంచి ఇండియా బయటపడుతుంది” అని డాక్టర్ గురువారెడ్డి స్పష్టం చేశారు.