బొమ్మ పడేదెప్పుడో.. తెలంగాణలో సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై కొనసాగుతున్న సందిగ్ధత

10TV Telugu News

cinema theatres reopen: కరోనాతో ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం అనుమతిస్తే దశలవారీగా ఓపెన్‌ చేయాలన్న నిర్ణయానికి ఎగ్జిబిటర్లు వచ్చారు. వినోదానికి దూరమైన ప్రజలు కూడా థియేటర్లు తెరిస్తేనే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు.

తుది నిర్ణయం తీసుకోని తెలంగాణ సర్కార్‌:
కరోనాతో మూతపడిన సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల పునఃప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. 50 శాతం సీట్ల సామర్థ్యంలో ఓపెనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినా.. తెలంగాణ సర్కార్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీ, తమిళనాడు, కర్నాటకలో థియేటర్లు ప్రారంభమయ్యాయి. కరోనా కేసులు ఎక్కుగా ఉన్నా మహారాష్ట్ర ఓపెనింగ్‌కు అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పర్మిషన్‌ ఇస్తే కొవిడ్‌ జాగ్రత్తలతో థియేటర్లు తెరవాలన్న నిర్ణయానికి ఎగ్జిబిటర్లు వచ్చారు.

తెరవాలని కొందరు.. వద్దని మరికొందరు..
మరోవైపు థియేటర్ల ఓపెనింగ్‌పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు తెరవాలంటుంటే మరికొందరు వద్దన్న వాదాన్ని వినిపిస్తున్నారు. థియేటర్‌లో సినిమా చూస్తే ఉండే ఆనందం.. టీవీలో ఉండదన్న భావం వ్యక్తమవుతోంది. ఇంకోవైపు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరికొంతకాలం థియేటర్లను తెవరవకపోవడమే మంచిదన్న అభిప్రాయం ఉంది.
https://10tv.in/viral-pic-of-baby-removing-doctors-mask-becomes-symbol-of-hope/
కొద్దిపాటి జీతంతో సర్దుకుపోతున్న కార్మికులు
థియేటర్ల మూతతో వాటిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. యజమానులు ఇచ్చే కొద్దిపాటి జీతంతో సర్దుకుపోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిస్తేనే మంచిదన్న భావంతో కార్మికులు ఉన్నారు. మొత్తం మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తే మినహా.. థియేటర్ల పునఃప్రారంభంపై ఎగ్జిబిటర్లు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు.

×