TDP : టీటీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..నేతలతో బాబు మీటింగ్

తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. 2021, జూలై 10వ తేదీ హైదరాబాద్ లోని బాబు నివాసానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఎల్.రమణ రాజీనామా అంశంతో పాటు కొత్త నాయకుడి ఎన్నిక..పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి..తదితర వాటిపై బాబు చర్చించనున్నారు.

TDP : టీటీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..నేతలతో బాబు మీటింగ్

Ttdp babu

T.TDP President : తెలంగాణ రాష్ట్రంలో టీ.టీడీపీ పరిస్థితిపై అయోమయం నెలకొంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ పార్టీకి రాజీనామా చేసి..మొన్న టీఆర్ఎస్ కండువా కపుకున్న సంగతి తెలిసిందే. దీంతో అధ్యక్షుడు లేని పార్టీలా తయారైంది. దీంతో పార్టీని గాడిన పెట్టేందుకు జాతీయ అధ్యక్షుడు నడుం బిగించారు.

Read More : Tamilnadu Lockdown : మరికొన్ని సడలింపులతో జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగింపు

కొత్త ప్రెసిడెంట్ ఎన్నికపై దృష్టి సారించారు. తెలంగాణ పార్టీకి చెందిన నేతలతో బాబు సమావేశం నిర్వహించారు. 2021, జూలై 10వ తేదీ హైదరాబాద్ లోని బాబు నివాసానికి పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఎల్.రమణ రాజీనామా అంశంతో పాటు కొత్త నాయకుడి ఎన్నిక..పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి..తదితర వాటిపై బాబు చర్చించనున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింహులు, తిరునగరి జ్యోత్స, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్ గౌడ్ లు హాజరు కాగా..కొత్తకోట దయాకర్ రెడ్డి డుమ్మా కొట్టడం గమనార్హం.

Read More : Google Pay Limit : గూగుల్ పే నుంచి రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చుంటే?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ రాజీనామా చేయడంతో ఆ పార్టీలో కలకలం రేపింది. దీంతో పార్టీ ప్రతిష్ట మసకబారినట్లైందనే చర్చ మొదలైంది. టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించడంతో బాబు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో..పార్టీని గాడిలో పెట్టాలని బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా…బీసీ నేతను అధ్యక్షుడిగా ఎన్నిక చేయాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం.