ఫ్లెక్సీలపై వైఎస్ విజయమ్మ ఫొటో ఎందుకు లేదు?

ఫ్లెక్సీలపై వైఎస్ విజయమ్మ ఫొటో ఎందుకు లేదు?

YS Vijayamma photo on flexi : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు చేశారు. షర్మిల టీమ్ త్వరలో ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేయనుంది. పార్టీ పేరును త్వరలో ఈసీకి దరఖాస్తు చేసే యోచనలో ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?..ఎందుకు రాకూడదని ప్రశ్నించారు.

కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందని భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం చేయాలన్నారు.

ఇవాళ(ఫిబ్రవరి 9,2021) వైఎస్ఆర్-విజయమ్మ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని షర్మిల కొత్త పార్టీ పేరు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, లోటస్ పాండ్ దగ్గర ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లోటస్ పాండ్ దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో వైఎస్ఆర్, షర్మిల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా కూడా సీఎం జగన్ ఫొటో లేదు. అంతేకాదు విజయమ్మ ఫొటో కూడా లేదు. ఈ అంశం ఆసక్తికరంగా మారింది.

ఫ్లెక్సీల్లో వైఎస్ విజయమ్మ ఫొటో పెట్టలేదు. అయితే విజయమ్మ ఫొటో పెట్టకపోవడానికి కారణం.. ఆమె వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండటమేని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నప్పుడు తన తల్లి ఫొటో కూడా పెట్టలేదు. వైపీపీకి, కొత్త పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కొత్త పార్టీ కేవలం తెలంగాణ వరకు మాత్రమే పరిమితమని సంకేతాలు ఇస్తున్నారు. దీన్ని బట్టి కార్యాచరణ తీసుకోవాలని భావిస్తున్నారు.

లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ మాజీ వైసీపీ నేతలు మీటింగ్ హాజరయ్యారు. లోటస్ పాండ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. షర్మిల బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు.