YS Sharmila : తెలంగాణను అప్పుల కుప్ప చేసినందుకు కేసీఆర్‌ను మళ్లీ సీఎంని చేయాలా?- షర్మిల ఫైర్

YS Sharmila : ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? ఇంటికో ఉద్యోగం అని చెప్పి..

YS Sharmila : తెలంగాణను అప్పుల కుప్ప చేసినందుకు కేసీఆర్‌ను మళ్లీ సీఎంని చేయాలా?- షర్మిల ఫైర్

YS Sharmila

YS Sharmila – KCR : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ టార్గెట్ గా YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదిగాక కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలివిలేనోళ్లు కాంగ్రెసోళ్ళయితే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొన్న మీది అతి తెలివి కాదా చిన్న దొర..! అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ నేతలు చేతకాని వారు అయితే 2014 లో ఆరుగురిని కొన్న మీరు అంతకన్నా చేతకాని వారు కారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లు చేతకాని సన్నాసులే అయితే 2018 లో 12మందిని కొన్నందుకు మీరు పెద్ద సన్నాసులు కారా..? అని అడిగారు.

” ప్రతిపక్ష లీడర్లు ఎన్నికల సమయంలోనే కనిపించే సంక్రాంతి గంగిరెద్దులైతే.. ఎన్నికలకు 6 నెలల ముందు నిద్ర లేచిన కుంభకర్ణుడు కేసీఆర్. ఎందుకు మళ్ళీ కేసీఆర్ ను ఆశీర్వదించాలో ఒక్క కారణం చెప్పు చిన్న దొర..? రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని.. రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసినందుకు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా..?(YS Sharmila)

Also Read..Bhatti Vikramarka: వారి ముత్తాతలు వచ్చినా అడ్డుకోలేరు.. మరో 5 నెలల్లో అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఆ తర్వాత..

ప్రాజెక్టుల పేరు చెప్పి మీ కుటుంబం లక్ష కోట్లు కాజేసినందుకు ఆశీర్వదించాలా..? ఇంటికో ఉద్యోగం అని చెప్పి, 9ఏళ్లలో 65 వేల ఉద్యోగాలే ఇచ్చినందుకు మళ్ళీ అధికారం ఇవ్వాలా? మీ పాలనలో నిరుద్యోగం 100 రెట్లు పెరిగి నిరుద్యోగ జాబితాలో, ఆత్మహత్యల్లో నెం.1 ఉన్నందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలా? రెండు దఫాలుగా లక్ష ఇళ్లు కట్టలేని మీరు మళ్ళీ పేదలను ఉద్దరిస్తామని చెప్తే నమ్మాలా..?

ధరణి పేరు చెప్పి భూములు లాక్కున్నందుకు.. మీ అనుచర వర్గం కోసం 30 వేల ఎకరాలు సర్కారు భూమి అమ్మినందుకు మీరు గొప్పోల్లు అని ఆశీర్వాదం ఇవ్వాలా..? పోలీసులను పనోళ్లుగా వాడుకుంటూ రౌడీల పాలన చేస్తున్నందుకు, తాలిబన్ల పాలన చూపిస్తున్నందుకు ఓట్లు వేయమంటారా..?(YS Sharmila)

Also Read..KTR : ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ : మంత్రి కేటీఆర్

వడ్లు కొనడం లేదని కేంద్రం మీద నెపం నెట్టి, రైతుల చావులకు కారణం అయినందుకు ఎలా దీవించమంటారు? వరి వేస్తే ఉరేనని.. కౌలు రైతు రైతే కాదన్న వ్యక్తి కేసీఆర్. 9వేల మంది రైతులను పొట్టనపెట్టుకున్న వ్యక్తి కేసీఆర్. పోడు పట్టాల నుంచి మొదలు దళితబంధు వరకు మోసాలకు తెగబడ్డ వ్యక్తి కేసీఆర్. చేతకాని వారంతా బందిపోట్ల రాష్ట్ర సమితిలోనే ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. మీలాంటి చేతకాని వారిని, సన్నాసులను ఆశీర్వదించడం కాదు. తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల.(YS Sharmila)