Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

అప్పులు, అవమానం, శాడిజం.. ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

Married Woman Suicide : భర్త వేధింపులు భరించలేక పిల్లలతో సహా భార్య ఆత్మహత్య

Suicide

Married Woman suicide including children : అప్పులు, అవమానం, శాడిజం.. ఈ మూడు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో భర్త సాయికుమార్‌ వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో సహా తల్లి స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన జగన్నాథం, శారద దంపతుల రెండో కుమార్తె స్వాతి. కుటుంబం రాజేంద్రనగర్‌ ఫోర్టువ్యూ కాలనీలో నివాసం ఉంటోంది.

స్వాతి, సాయి సికింద్రాబాద్‌ ఎస్వీఐటో ఇంజినీరింగ్‌ చదివారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2016 ఆగస్టులో కులాంతర వివాహం చేసుకున్నారు. తొలుత యూసుఫ్‌గూడలో ఉండేవారు. భార్యభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. గొడవలతో రాజేంద్రనగర్‌కు మకాం మార్చారు. వారికి నాలుగేళ్ల తన్విక్‌, మూడేళ్ల శ్రేయ ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Saiteja Funeral: సైనిక లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు పూర్తి

సాయికుమార్‌ విలాసవంతమైన జీవితానికి అలవాటుపట్డారు. జల్సాలు చేసేవాడు. స్థాయికి మించి అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చాలంటూ.. స్వాతిని వేధించేవాడు. ఇది ఇద్దరి మధ్య మనస్పర్ధలకు దారితీసింది. క్రమంగా అవి తారా స్థాయికి చేరాయి. విషయం స్వాతి కుటుంబ సభ్యులకు తెలిసింది. సాయి అత్త శారద తెలిసిన వారి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు అప్పు ఇప్పించింది. అయినా ఇంకా డబ్బుల కోసం స్వాతిని వేధించేవాడు.

భర్త ప్రవర్తనతో విసిగిపోయిన స్వాతి.. మనస్తాపం చెందింది. సూసైడ్‌ నోటి రాసి.. ముందుగా పిల్లలను ఉరేసి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ నోట్‌లో స్వాతి పలు విషయాలను ప్రస్తావించింది. భర్త సైకో, శాడిస్ట్‌.. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడని రాసింది. పైగా తన ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.

Skill Development Case : ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో నిందితులకు రిమాండ్‌..మచిలీపట్నం సబ్‌జైలుకు తరలింపు

ప్రవర్తన మార్చుకోవాలని భర్తకు సూచించినా మారలేదని ప్రస్తావించింది. పిల్లలకి, తనకు జత బట్టలు కూడా కొనివ్వలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. . తాను లేకపోతే పిల్లలను ఎవరూ చూస్కోరని.. అందుకే తనతో పాటే వాళ్లను కూడా తీసుకుపోతున్నానంటూ ఆమె రాసిన లేఖ అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది.