Telangana Lockdown : పొడిగింపా? సడలింపా? తెలంగాణలో మే 30 తర్వాత ఏం జరగనుంది?

తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే చివరి నాటి వరకు అదే విధంగా విధులు నిర్వహించనున్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? లాక్ డౌన్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తారా? లేక నైట్ కర్ఫ్యూకే పరిమితం చేస్తారా? అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ సీఎం కేసీఆర్ మనసులో ఏముంది?

Telangana Lockdown : పొడిగింపా? సడలింపా? తెలంగాణలో మే 30 తర్వాత ఏం జరగనుంది?

Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే చివరి నాటి వరకు అదే విధంగా విధులు నిర్వహించనున్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? లాక్ డౌన్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడిగిస్తారా? లేక నైట్ కర్ఫ్యూకే పరిమితం చేస్తారా? అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంతకీ సీఎం కేసీఆర్ మనసులో ఏముంది?

తెలంగాణలో మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అది పూర్తవుతున్న క్రమంలోనే మే 30వరకు లాక్ డౌన్ పొడిగించారు. రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ విధించి 4 గంటలు పాటు సడలింపు ఇచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేలా ఈ సడలింపు ఇచ్చారు. కరోనా చైన్ ను బ్రేక్ చేయడమే లక్ష్యంగా ఈ లాక్ డౌన్ అమలు జరుగుతోంది. మొదటి 10 రోజులు కాస్త రిలాక్స్డ్ గా కనిపించినా, కేసీఆర్ ఆదేశాలతో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు పోలీసులు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కేసులు నమోదు చేయడమే కాకుండా వాహనాలు సీజ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. కరోనా గ్రాఫ్ క్రమంగా కిందకు పడిపోతోంది. ఇప్పుడు నిత్యం 3వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మరింత పకడ్బందీగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తుండటంతో నెలాఖరు నాటికి రోజుకు వెయ్యి కేసులు మాత్రమే నిర్ధారణ అవుతాయని అంచనాలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అదే జరిగితే లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తుందా? లేక మరింత కఠినంగా అమలు చేసి పూర్తి కట్టడికి ప్రయత్నిస్తుందా అనేది చర్చకు దారితీసింది.

లాక్ డౌన్ గడువు మే 30న ముగియనుంది. దీంతో మే 28 లేదా మే 29న దీనిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అనే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలవుతోంది. ఇదే తరహాలో ఇప్పుడిస్తున్న 4 గంటల సడలింపును మరికొన్ని గంటలు పెంచే అవకాశం ఉన్నట్లు కొన్నివర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ముందుగా పెట్టినట్టు కేవలం నైట్ కర్ఫ్యూకే పరిమితం అవుతారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల ఆర్థిక మూలాలు దెబ్బ తినకుండా సడలింపుల వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వం కూడా ఫస్ట్ వేవ్ లో భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న ఆర్థిక వ్యవస్థ దిగజారిపోకుండా లాక్ డౌన్ సడలిస్తారని కొన్ని వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అయితే, కేసుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తున్నా, లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కరోనా రోగుల సంఖ్య, ఇక్కడ బాధితుల సంచారం పెరిగి కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారులతో క్షుణ్ణంగా సమీక్షించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్.