Renuka Chowdhury : ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా- మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అలాగే ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానం ఉందని చెప్పారు. అవసరమైతే ఖమ్మం, గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానన్నారు.

Renuka Chowdhury : ఖమ్మం, గుడివాడ.. రెండు చోట్లా పోటీ చేస్తా- మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు

Renuka Chowdhury : మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అలాగే ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేయాలని ఆహ్వానం ఉందని చెప్పారు. అవసరమైతే ఖమ్మం, గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని స్పష్టం చేశారు రేణుకా చౌదరి. ఖమ్మం ఎంపీ విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానన్నారు.

కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఖమ్మంకి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని ఆమె చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తామని రేణుకా చౌదరి సవాల్ విసిరారు.

Also Read..#Telanganabudget: ఏనుగు తొండమంత నిధులు చూపించి, ఎలుక తోకంత విడుదల చేస్తున్నారు: బీజేపీ నేతల విమర్శలు

”మా ఇంచార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు వచ్చి కలిశా. ఠాక్రేతో పాటు వెళ్లి హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొంటా. ఖమ్మంకి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తాం. పెద్ద సభ పెడతాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం గ్రామాల్లోకి ఎలా వస్తారో చూస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవ్వొద్దని చెప్పా.
నేను ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీ చేస్తా. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు పోటీ విషయం ఆలోచిస్తా. ఏపీలోని గుడివాడ నుండి కూడా పోటీ చేయమంటూ ఆహ్వానం ఉంది. అవసరం అనుకుంటే రెండు చోట్లా పోటీ చేస్తా” అని రేణుకా చౌదరి అన్నారు.

Also Read..Ponguleti Srinivasa Reddy: శీనన్న ఒక్కడు కాదు.. బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

ఎక్కడా దిక్కులేని వాళ్లంతా కాంగ్రెస్ లోకి వస్తారన్న రేణుకా చౌదరి.. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ మంచిదే అని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ లో గొడవలు చూసి సిగ్గు పడుతున్నానని ఆమె అన్నారు. ఇంచార్జి వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం అన్నారు. రేవంత్ పాదయాత్రలో తాను పాల్గొంటనని ఆమె స్పష్టం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాంగ్రెస్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రను ఎంపీ రేవంత్ రెడ్డి మేడారంలో ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు మేడారం చేరుకున్న రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం మేడారం వన దేవతలను దర్శించుకుని ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి మాణిక్ రావ్ థాక్రే, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.