Bandi Sanjay On Telangana : సెంటిమెంట్ రగిలించే కుట్ర జరుగుతోంది – ఎన్నారైలతో బండి సంజయ్

కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని వాపోయారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం అని చెప్పారు.

Bandi Sanjay On Telangana : సెంటిమెంట్ రగిలించే కుట్ర జరుగుతోంది – ఎన్నారైలతో బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay On Telangana : అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏక్ దక్కా – తెలంగాణ పక్కా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జూమ్ లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని బండి సంజయ్ వాపోయారు. ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకుంది? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రాన్ని బద్నాం చేసి తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించేందుకు సీఎం కేసీఆర్ మరో కుట్ర పన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనే లక్ష్యంగా తాము యుద్ధం చేస్తున్నాం అని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతి బండారంపై న్యాయ, క్షేత్రస్థాయి పోరాటాలు చేస్తున్నాం అని తెలిపారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యం అని ఆయన తేల్చి చెప్పారు. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.(Bandi Sanjay On Telangana)

Paddy Procurement Row : తెలంగాణ.. భారత్‌లో భాగం కాదా? ఎందుకీ వివక్ష..? కేంద్రంపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం

బీజేపీ చేస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలని ప్రవాస భారతీయులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి మాతృభూమి రుణం తీర్చుకోండి అని ప్రసవా భారతీయులను కోరారు బండి సంజయ్. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రవాసులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

”వందలాది మంది బలిదానాలు చేసుకుని సాధించిన తెలంగాణ అధోగతి పాలవుతోంది. కేసీఆర్ సర్కార్ అవినీతి పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో నియంత కుటుంబ పాలన అంతమొందిస్తాం. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా బీజేపీ యుద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ మరోమారు సెంటిమెంట్‌ను రగిలించే కుట్ర చేస్తున్నారు. కేంద్రంపై బురదజల్లి తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న పోరాటానికి అందరూ అండగా నిలవాలి” అని ఎన్నారైలను కోరారు బండి సంజయ్.

Telangana : ‘ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్‌ ఫిక్స్‌..కౌంట్‌డౌన్‌ స్టార్ట్’ఢిల్లీలోరచ్చకు TRS రెఢీ

వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కేసీఆర్ అవినీతి బండారం బయటపెడతామంటూ బీజేపీ నేతలు సవాల్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బియ్యం రీసైక్లింగ్‌ చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించడమే కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పెరగనున్న కరెంట్ చార్జీలపై కూడా ఉద్యమించేందుకు కాషాయ నేతలు సిద్ధమవుతున్నారు. కాగా, ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమైంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకు సాగుతున్నారు.