Bharat Biotech Vaccine : తెలంగాణ‌కు స‌రిపోయేంత టీకాలు అందిస్తామన్న భార‌త్ బ‌యోటెక్

తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేంత టీకాలు అందిస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మావేశం అయ్యారు.

Bharat Biotech Vaccine : తెలంగాణ‌కు స‌రిపోయేంత టీకాలు అందిస్తామన్న భార‌త్ బ‌యోటెక్

Will Give More Than Enough Vaccines For Telangana, Says Bharth Biotech

Bharat Biotech Vaccine for Telangana : తెలంగాణ రాష్ట్రానికి సరిపోయేంత టీకాలు అందిస్తామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ మేరకు సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో కొవాగ్జిన్ టీకాల‌పై చర్చ జరిగింది.

అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు భార‌త్ బ‌యోటెక్ ఎండీతో స‌మావేశమైనట్టు తెలిపారు. అంద‌రికీ ఉచితంగా టీకా ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారన్నారు. వీలైన‌న్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాల‌ని కోరారు. భార‌త్ బ‌యోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ టీకాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా టీకా ఉచితంగా ఇస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల ప్రాణాల కంటే డ‌బ్బు ముఖ్యం కాదు తేల్చిచెప్పారు. వ్యాక్సినేష‌న్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంటున్నారు. వ్యాక్సినేష‌న్ కోసం ఇప్ప‌టికే అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్‌తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయి.