లాక్ డౌన్ ఎత్తేస్తారా ? పొడిగిస్తారా ? అందరిలో ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 02:38 AM IST
లాక్ డౌన్ ఎత్తేస్తారా ? పొడిగిస్తారా ? అందరిలో ఉత్కంఠ

లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు 2020, మార్చి 24వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.

కానీ తెలంగాణలో మాత్రం కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. తొలుత తక్కువ సంఖ్యలో నమోదైనా..మర్కజ్ ఘటన అనంతరం ఆమాంతం కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో పరిస్థితి కొంత సీరియస్ గానే ఉంది. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే ఉత్కంఠ నెలకొంది. 

దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్షించిన తర్వాతే..పలు అంశాలపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తేసే క్రమంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పటి నుండే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ప్రకటన వెలువడినప్పటి నుంచి రైళ్లు, విమాన సర్వీసులు, ఇతర రవాణాకు సంబంధించిన సర్వీసులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం రైల్వే, విమాన శాఖలు ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నాయి. 

లాక్ డౌన్ చేసిన అనంతరం స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వాలకు అతి ముఖ్యమైన అంశమని మంత్రి రమేశ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత కూడా మూసివేసే పరిస్థితి వచ్చినా..విద్యా సంవత్సరం కోల్పోకుండా చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇదిలా ఉంటే..లాక్ డౌన్ అనంతర పరిణామాలకు తగ్గట్టుగా కొన్ని పథకాల్లో మార్పులు తీసుకరావడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. (ఒక్కరినీ వదలకుండా పరీక్షలు చేయండి : వైద్య శాఖ పనితీరు భేష్ – కేసీఆర్)

రోనా వైరస్ పాజిటివ్ కేసులు తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదయ్యాయి. కానీ..నిజాముద్దీన్ తబ్లీగీ జమాత్ సదస్సు తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశానికి హాజరై ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కరోనా వైరస్ సోకింది. వీరి నుంచి ఇతరులకు వైరస్ సోకడంతో కేసులు అమితంగా పెరిగిపోతూ వచ్చాయి. ప్రస్తుత క్రమంలో లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడనుందో వేచి చూడాలి.