KA Paul : మునుగోడులో గెలిపిస్తే.. 6 నెలల్లో అమెరికా చేస్తా-కేఏ పాల్

మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.

KA Paul : మునుగోడులో గెలిపిస్తే.. 6 నెలల్లో అమెరికా చేస్తా-కేఏ పాల్

KA Paul : ఇక ప్రపంచ శాంతి సభకు అనుమతి ఇవ్వనందుకు సీఎం కేసీఆర్ తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. కేసీఆర్ వచ్చి క్షమాపణ చెప్పేవరకు తన ఆమరణ దీక్ష కొనసాగిస్తానన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.

2008లో కేసీఆర్ తాజ్ కృష్ణకు వచ్చారు రెండుసార్లు. చారిటీస్ కోసం వచ్చారు. మాకు సపోర్ట్ చేయండి మీకు 2005లో కాంగ్రెస్ క్యాన్సిల్ చేసిన పీస్ మిషన్ మేము రెస్టోర్ చేస్తాం. తద్వారా మీరు వేల కోట్లు తీసుకొస్తున్నారని టీవీల్లో మీడియాల్లో రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజుకి ఎన్నిమిదిన్నరేళ్లలో 106 సార్లు కాల్ చేశాం. అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. కంపెనీలు తెస్తామన్నారు. సమ్మిట్ లు, కాన్ఫరెన్స్ లు. కానీ ఒక్కటి కూడా చేయలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటికైనా కేసీఆర్ ప్రపంచ శాంతి సభకు పర్మిషన్ ఇవ్వాలి. మూడు నెలలు ఒక సమ్మిట్ పెడదాం. డిసెంబర్ 31లోగా ఒక సమ్మిట్ పెడదాం. లక్షల కోట్లు తీసుకొద్దాం. లక్షల ఉద్యోగాలు తీసుకొద్దాం. అప్పుల తెలంగాణను అభివృద్ధి తెలంగాణ చేద్దాం. అని నేను అంటున్నా కేసీఆర్ స్పందించడం లేదు. మునుగోడులో ప్రతీ గ్రామం వెళ్తాం. అప్పులు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ను మునుగోడు ప్రజలు ఓడించి తీరాలి.

మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపించి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నేనా? మరొకరా? అనేది త్వరలో నిర్ణయిస్తాం.

దేశ్ కా నేత కావడానికి కేసీఆర్ భారత రాష్ట్ర పార్టీ పెడతారంట. తెలంగాణ డబ్బు తీసుకెళ్లి దేశమంతా పంచుతున్నారు. ఇప్పటికి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ట్యాక్స్ పేయర్ల డబ్బుతో ఆయన తిరగడానికి విమానం కొంటున్నారు. ఎంత అవినీతి? కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించరు” అని కేఏ పాల్ ఫైర్ అయ్యారు.