Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి

నోటీసులు ఇవ్వకుండా ఎవరు రావడానికి వీలు లేదని, ఇదే విషయాన్నీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు కళ్యాణి తెలిపారు.

Karate Kalyani: నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై లీగల్ యాక్షన్: కరాటే కళ్యాణి

Kalyani

Karate Kalyani: గత రెండు రోజులుగా నాపై అనేక ఆరోపణలు వచ్చాయని, నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై త్వరలో లీగల్ యాక్షన్ తీసుకోనున్నట్లు సినీ నటి కరాటే కళ్యాణి తెలిపారు. పాప దత్తత వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కళ్యాణి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బుధవారం హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని బాలల హక్కులు పరిరక్షణ కమిషన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె పలు వివరాలు వెల్లడించారు. తాను పాపాను దత్తత తీసుకోలేదని స్పష్టం చేసిన కళ్యాణి.. పాపా తల్లి తండ్రులు కూడా తనతో పాటె ఉంటున్నట్లు వివరించారు. పాపను దత్తత తీసుకుంటే లీగల్ గానే తీసుకుంటానని అన్నారు.

Other Stories:Karate Kalyani On ChildAdoption : చిన్నారిని దత్తత తీసుకున్నా అని చెప్పడానికి కారణమిదే-కరాటే కల్యాణి

తనపై వచ్చిన ఆరోపణల్లో విచారణ జరిపేందుకు నోటీస్ లు ఇవ్వకుండానే అధికారులు తమ ఇంటికి వచ్చారని, ఆరోపణల పైనా అధికారులు తనకు ఎలాంటి నోటీస్ లు ఇవ్వలేదని ఆమె చెప్పుకొచ్చారు. నోటీసులు ఇవ్వకుండా ఎవరు రావడానికి వీలు లేదని, ఇదే విషయాన్నీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు కళ్యాణి తెలిపారు. వచ్చిన ఆరోపణలపై క్లీన్ చిట్ గా బయట కు వచ్చానని అన్నారు. తనను వివాదంలోకి లాగడంపై ఎంతో వేదనకు గురైన మా అమ్మ, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారని, ఏ తప్పు చెయ్యలేదని వారికి ధైర్యం చెప్పినట్లు కరాటే కళ్యాణి తెలిపారు.

Other Stories:Traffic Constable Cries: పోలీస్ స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఎందుకంటే

‘నాపై ఎవరైతే నిరాధారమైన ఆరోపణలు చేశారో వారిని త్వరలోనే వారిని లీగల్ గా ఎదుర్కొంటాను, నేను బీసీ బిడ్డను, నన్ను రాజకీయంగా ఎదుర్కొన లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, నా పై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు, అధికారులు వున్నారు” అని కరాటే కళ్యాణి అన్నారు. అధికారులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని చెప్పినట్లు కళ్యాణి తెలిపారు.