Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు…? 30న క్లారిటీ

తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తెలంగాణ కేబినెట్ ఈ నెల 30న జరగబోతోంది. దీంతో లాక్ డౌన్ పై మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కరోనా కట్టడికి ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తోంది.

Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు…? 30న క్లారిటీ

Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తెలంగాణ కేబినెట్ ఈ నెల 30న జరగబోతోంది. దీంతో లాక్ డౌన్ పై మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణలో కరోనా కట్టడికి ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తోంది.

ఈ నెల 30వరకు లాక్ డౌన్ కు గడువు ఉండటంతో ప్రభుత్వం దాన్ని పొడిస్తుందా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. లాక్ డౌన్ విధించే నాటికి రాష్ట్రంలో రోజుకు 8వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజూ 60 దాటింది. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కఠిన ఆంక్షలు అమలు చేసింది. అప్పటి నుంచి కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను కంటిన్యూ చేస్తుందా? లేదా తొలగిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 2వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా స్వల్పంగా తగ్గాయి. వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. మరోపక్క రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులూ పెరుగుతున్నాయి. సరిపడ బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లాక్ డౌన్ ను కంటిన్యూ చేయాలని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో 10 రోజులు కంటిన్యూ చేస్తే వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తుందని, జూన్ 10వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించినట్లుగా సమాచారం.

వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది. ఒకవేళ లాక్ డౌన్ ఇలానే కొనసాగిస్తే ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై ప్రభుత్వం ఓ క్లారిటీకి రానుంది. కొన్ని సడలింపులు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా ప్రభుత్వం ఆలోచనలో పడింది. అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఏ విధంగా చూసినా లాక్ డౌన్ తో వైరస్ వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.