జూన్ 1న స్కూళ్లు ప్రారంభమయ్యేనా ? 10వ తరగతి పరీక్షలు అనుమానమే

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 05:16 AM IST
జూన్ 1న స్కూళ్లు ప్రారంభమయ్యేనా ? 10వ తరగతి పరీక్షలు అనుమానమే

ఈసారి విద్యా వ్యవస్థ గతంలో ఎదుర్కొనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి ఎంతో ప్రభావం చూపిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి..భారతదేశంలో విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. పాఠశాలలు మూతపడ్డాయి. ఏప్రిల్ మొదటి వారం గడుస్తున్నా..ఈ వైరస్ ఇంకా శాంతించలేదు.

దీంతో విద్యా సంవత్సరంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జూన్ 01వ తేదీ వేసవి సెలవులు ముగిసి తిరిగి బడులు ప్రారంభమౌతాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పదో తరగతి పరీక్షలు ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు చక్కబడితే ఈ పరీక్షలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ నిర్వహిస్తే…మే నెలలో టీచర్లు ఇన్విజిలేటర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను సరిదిద్దాల్సి ఉంటుంది. మూల్యాంకనం చేసిన తర్వాత…వీరికి అదనంగా సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికారణంగా..విద్యా సంవత్సరం మరింత ఆలస్యంగా ప్రారంభించాల్సి వస్తుందని అంటున్నారు. 

ముందుగా ప్రకటించినట్లుగా షెడ్యూల్ ప్రకారం మార్చి 19వ తేదీన ప్రారంభమై..ఏప్రిల్ 06వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉండేది. కరోనా కారణంగా మార్చి 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన అన్నీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 01వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను ఏప్రిల్ 07వ తేదీ నుంచి స్టార్ట్ కావాలి. కానీ ఇప్పుడున్న సీన్ ప్రకారం చూస్తే.. పరీక్షలు జరిగేలా లేవు. అందువల్లే వీరికి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించాలని విద్యా శాఖాధికారులు యోచిస్తున్నారు.

కరోనా వైరస్ ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. కేసులు రోజురోజుకు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యా శాఖ నిబంధనల ప్రకారం..220 పని దినాలు పాఠశాలలు, కాలేజీలు పని చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాలి. (ప్రపంచవ్యాప్తంగా సామాజిక దూరం ఇలా పాటిస్తున్నారు)