Wine Shops : హైదరాబాద్‌లో రెండు రోజులు మద్యం షాపులు బంద్

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం పూర్తిగా, సోమవారం పాక్షికంగా మద్యం షాపులు మూత పడనున్నాయి. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల( హైద‌రాబాద్

10TV Telugu News

Wine Shops Closed : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం పూర్తిగా, సోమవారం పాక్షికంగా మద్యం షాపులు మూత పడనున్నాయి. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్ల( హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ) పరిధిలోని వైన్స్, బార్లు, పబ్ లు బంద్ కానున్నాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు వీటిని మూసివేయాలని ఎక్సైజ్ పోలీసులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు పెట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర సాగే మార్గం మీదుగా కాకుండా ప్రత్యామ్నయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Junk Mails Delete : అదేపనిగా జంక్ మెయిల్స్ వస్తున్నాయా? ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు!

ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో నగర ప్రజల కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వాహనాల దారి మల్లింపు, ట్రాఫిక్ ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లు 040-27852482, 9490598985, 9010303626 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. అంతేకాదు.. గూగుల్ మ్యాప్‌లో ట్రాఫిక్ రద్దీపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Aadhaar : మీ ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో చెక్ చేయండిలా!

గణేష్ నిమజ్జన యాత్ర గూగుల్ రూట్ మ్యాప్..
1. బాలాపూర్ నుండి వచ్చే శోభాయాత్ర, ఫలక్ నుమా నుంచి వచ్చే శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలీగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్‌కు వినాయక విగ్రహాలను తరలించనున్నారు.
2. బేగం బజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్​గంజ్, గౌలిగూడా మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.
3. సికింద్రాబాద్ నుంచి వచ్చే శోభాయాత్ర ఆర్పీ రోడ్, కర్బలా మైదానం, కవాడిగుడ, ముషీరాబాద్ కూడలి, హిమాయత్ నగర్ జంక్షన్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బ్యాండ్ లేదా ఎన్‌టీఆర్ మార్గ్ వైపునకు విగ్రహాలు మళ్లిస్తారు.
4. ఉప్పల్ నుంచి వచ్చే శోభాయాత్ర రామాంతపూర్, అంబర్​పేట కూడలి, శివం రోడ్, ఫీవర్ ఆస్పత్రి, నారాయణగూడ కూడలి, లిబర్టీ మీదుగా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.
5. దిల్‌సుఖ్​నగర్, ఐఎస్ ​సదన్ వైపు నుంచి వచ్చే శోభాయాత్ర సైదాబాద్, నల్గొండ క్రాస్ రోడ్, చాదర్ ఘాట్, ఎంజే మార్కెట్ మీదుగా సాగనుంది.
6. టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే శోభాయాత్ర మాసబ్ ట్యాంక్, నిరంకారి భవన్ మీదుగా ఎన్‌టీఆర్ ​మార్గ్ ​వైపునకు మళ్లించనున్నారు.