Huzurabad By-Election : హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ

తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.

Huzurabad By-Election : హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ

Huzurabad

Withdrawal of nominations : తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు? ఎంత మంది పోటీలో ఉండనున్నారనే విషయం సాయంత్రం తేలనుంది.

దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించనుంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి.

Huzurabad by poll: హుజూరాబాద్ బై పోల్ అభ్యర్థుల్లో బలహీనతలేంటి..?

మరోవైపు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ టీఆర్ఎస్‌-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తగ్గేది లేదంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రచారాన్ని మరింత హీటెక్కిస్తున్నారు. తాజాగా… హరీశ్‌రావు సవాళ్లతో వేడిని రగిలిస్తే… బాల్క సుమన్‌ కంప్లైంట్‌తో మరింత కాక రేపారు.

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మరో సవాల్‌ విసిరారు హరీశ్‌రావు. గ్యాస్ ధర విషయంలో చర్చకు రావాలని, 291 రూపాయలు రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేదంటే ఎన్నికల నుంచి తప్పకుంటావా అంటూ రాజేందర్ ను సూటిగా ఛాలెంజ్‌ చేశారు. చర్చకు ప్లేస్, టైమ్ డిసైడ్ చేయాలని ఆఫర్‌ కూడా ఇచ్చారు. మరోవైపు.. కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద జరిగిన ప్రమాదంపై తీవ్ర దుమారం రేగుతోంది.
Huzurabad By-Election : హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు..టీఆర్ఎస్ – బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!

కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డెక్కితే… వారికి బీజేపీ అండగా నిలవడమే కాకుండా… అది అధికార పార్టీకి చెందిన కారని నిందలు మోపింది. దీనికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటు కౌంటరిచ్చారు. బీజేపీ అబద్దపు ప్రచారం చేస్తోందంటూ ఆధారాలు బయటపెట్టారు. ఈటల రాజేందర్‌పై ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.