Rudrangi Mandal : ఎమ్మర్వో ఆఫీసుకు తాళి కట్టిన కేసులో..ట్విస్ట్, విచారణాధికారి ఏమంటున్నారంటే

రుద్రంగి ఎమ్మార్వో ఆఫీసుకు తాళి బొట్టు కట్టిన ఘటనలో ట్విస్టు చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు..ఆర్డీవో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యను రెవెన్యూ అధికారులపై రుద్దినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలు మంగ స్థానికంగా ఉండడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు.

Rudrangi Mandal : ఎమ్మర్వో ఆఫీసుకు తాళి కట్టిన కేసులో..ట్విస్ట్, విచారణాధికారి ఏమంటున్నారంటే

Rudrangi

Rudrangi Mandal : రుద్రంగి ఎమ్మార్వో ఆఫీసుకు తాళి బొట్టు కట్టిన ఘటనలో ట్విస్టు చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు..ఆర్డీవో విచారణ చేపట్టారు. కుటుంబ సమస్యను రెవెన్యూ అధికారులపై రుద్దినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలు మంగ స్థానికంగా ఉండడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. స్థానికంగాల లేకపోవడంతో ఆమె మామ..మరణానంతరం భూమిని చిన్న కోడలు పేరిట మార్చినట్లు వెల్లడిస్తున్నారు. తన పేరు మీద వచ్చిన తర్వాత..చిన్న కోడలు భూమి అమ్ముకోవడంతో…వివాదం ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు.

తన భూమి తనకు ఇప్పించాలంటూ..మంగ అనే మహిళ రెవెన్యూ కార్యాలయానికి తాళి బొట్టు..కట్టి ఆందోళన కొనసాగించిన ఘటన కలకలం రేపింది. వేరే పేరిట పట్టా ఇచ్చారని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ చేయాలని ఆదేశించారు. 130/14 సర్వే నెంబర్ 2 ఎకరాలు అసైన్డ్ భూమి మంగ మామ పేరిట 1980 ఉన్నట్లు తేలిందని విచారణ అధికారి 10tvతో తెలిపారు. 2011లో రాజలింగం సోదరుడు రాజం పేరిట మారిపోయిందని, కుటుంబసభ్యుల మధ్య జరిగిన వివరాలు తమ దగ్గర అందుబాటులో లేదన్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ కార్యాలయం..గతంలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లి మండలంలో ఉందన్నారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రుద్రంగి మండలానికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన రికార్డులు లేవని, పహాణీలో మారిందని..ఇదే కంటిన్యూ వస్తోందన్నారు. 2013లో రాజం చనిపోయినట్లు, ఇతని కుమారుడు గల్ఫ్ లో ఉన్నాడని..ఇతని భార్య జల పేరిట పట్టా మార్పిడి జరిగిందన్నారు. రాజలింగం – రాజం మధ్య జరిగిన దానిపై వివాదం ఉందని, ఇరుపక్షాలు భిన్నవాదనలు వినిపిస్తున్నారని వెల్లడించారు. అన్నదమ్ముళ్ల మధ్య ఉమ్మడి ఆస్తి అని వారు చెబుతున్నారని, రాజలింగం పేరిట ఉందని..ఆమె వారసురాలు తానేనని బాధితురాలు ఆరోపిస్తోందన్నారు.