Sirisilla : ప్రభుత్వాస్పత్రిలో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన మహిళా సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Sirisilla : ప్రభుత్వాస్పత్రిలో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన మహిళా సిబ్బంది

Women Staff Dance

Women staff dance : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ బండి పాట తెగ హల్ చల్ చేస్తోంది. మ్యారేజ్ వేడుకలు, వివిధ ఫంక్షన్స్ ల్లో బుల్లెట్ బండి పాట మార్మోగుతోంది. ఈ పాటకు యువత డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగిస్తున్నారు. ఇటీవలే ఓ పెళ్లి బరాత్ లో బుల్లెట్ బండి పాటకు వధువు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విధులు పక్కన పెట్టి డ్యాన్స్ చేయడంప సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు.