ఉమెన్స్ డే స్పెషల్ : హైదరాబాద్‌, వికారాబాద్ మధ్య మహిళా సిబ్బందితో ప్యాసింజర్ రైలు

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.

  • Published By: veegamteam ,Published On : March 8, 2020 / 01:07 PM IST
ఉమెన్స్ డే స్పెషల్ : హైదరాబాద్‌, వికారాబాద్ మధ్య మహిళా సిబ్బందితో ప్యాసింజర్ రైలు

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రచారంలో భాగంగా భారత రైల్వే మార్చి 1 నుంచి 10 వరకు మహిళ దినోత్సవ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, రైలు గార్డు, టిటిఇలు, ఆర్పిఎఫ్ మొత్తం మహిళా సిబ్బందే ఉన్నారు.

‘ప్రతి ఒక్కరు సమానం’ అనే థీమ్‌ను ప్రోత్సహిస్తూ, 72 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేపట్టారు. దీనికి 80 నిమిషాల సమయం పడుతుంది. రైలులో మొత్తం మహిళా సిబ్బంది ఉన్నారు. రైల్వేలలో మహిళా శ్రామిక శక్తిని సాధికారపరచడంతో పాటు వారి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలతో ముందంజలో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంతకుముందు దక్షిణ మధ్య రైల్వే “ఆల్ ఉమెన్ స్టేషన్” భావనను ప్రవేశపెట్టింది. జోన్ లోని ఐదు రైల్వే స్టేషన్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. బేగంపేట, విద్యా నగర్, చంద్రగిరి, న్యూ గుంటూరు మరియు రామవరపాడు రైల్వే స్టేషన్ లో పూర్తిగా మహిళ సిబ్బంది పని చేస్తున్నారు. ఈ ఐదు రైల్వే స్టేషన్లు ప్రయాణీకుల సేవల్లో ఉత్తమమైనవిగా నిరూపించబడ్డాయి.

మహిళలకు సమాన అవకాశాలను కల్పించడానికి, ఎలాంటి వివక్ష లేకుండా, లింగ పక్షపాతాన్ని నిర్మూలించడానికి దక్షిణ మధ్య రైల్వే కట్టుబడి ఉందని జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై రైలు లోకో పైలట్ సరితా ఆర్ మెష్రామ్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళల సంక్షేమం పట్ల జోన్ ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.

అసిస్టెంట్ లోకో-పైలట్ మమతా కుమారి, గార్డ్ కుమారి వినీషా పి, టిటిఇ కరిష్మా, టిటిఇ మాంగా, టిటిఇ పావనా, ఆర్‌పిఎఫ్ నాసిమా బేగం, ఆర్‌పిఎఫ్ ఎం నిరోషా ఇతర సిబ్బంది ఉన్నారు.