3D Printed Temple : ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం.. తెలంగాణలోని సిద్ధిపేటలో

మూడు గర్భ గుడులతో ఉండే ఈ ఆలయంలో ఒకటి గణేషుడికి, మిగిలిన రెండు శివ, పార్వతులకు ప్రత్యేకించారు. గణేశుడి గుడి మోదకం, శివునికి చతురస్రాకారం, పార్వతి గుడి కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు.

3D Printed Temple : ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం.. తెలంగాణలోని సిద్ధిపేటలో

3D Printed Temple

Siddipet 3D Printed Temple : ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం తెలంగాణలో నిర్మాణం కానుంది. రాష్ట్రంలోని సిద్దిపేటలో తొలి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆలయాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్పుజా ఇన్ ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నాయి. 3డీ ప్రింటింగ్ ఆర్కిటెక్చర్ లో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెడుతుందని అప్పుజా ఇన్ ఫ్రాటెక్ ఎండీ హరికృష్ణ జీడిపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు.

సిద్ధిపేట జిల్లాలోని చర్విత మెడోస్ లో నిర్మించనున్న ఈ ఆలయం సంస్కృతి, ఆధునిక సాంకేతికతో పాటు మానవ సృజనాత్మక, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ ఆలయం 3,800 చదరపు అడుగుల వైశాల్యం, 30 అడుగుల ఎత్తులో మూడు భాగాలుగా ఉండనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్ వేర్ తో నిర్మిస్తున్నారు.

Mahashivratri : పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు .. పళ్లికొండేశ్వర దేవాలయం విశిష్టతలు

మూడు గర్భ గుడులతో ఉండే ఈ ఆలయంలో ఒకటి గణేషుడికి, మిగిలిన రెండు శివ, పార్వతులకు ప్రత్యేకించారు. గణేశుడి గుడి మోదకం, శివునికి చతురస్రాకారం, పార్వతి గుడి కమలం ఆకారంలో నిర్మిస్తున్నారు. మోదకం, కమలం ఆకారాన్ని ఆన్ లైన్ లో డిజైన్ చేయడం ద్వారా సవాళ్లతో కూడిందని హరికృష్ణ వెల్లడించారు. ఆలయ వాస్తు పద్ధతుల ప్రకారం వినూత్నంగా వీటిని డిజైన్ చేసినట్లు తెలిపారు.

ఆలయం రెండో దశలో గోపురంతో పాటు కమలం నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. చర్విత మెడోస్ లో
దేశంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ బ్రిడ్జీ ప్రోటోటైప్ నిర్మాణం తర్వాత ఈ 3డీ ప్రింటెడ్ ఆలయ నిర్మాణం రాష్ట్రానికి మరోసారి ప్రత్యేక స్థానాన్ని తెచ్చి పెడుతుందని తెలిపారు.

‘Bijli Mahadev’ Shivling : ‘పిడుగుల పరమేశ్వరుడి’ ఆలయం విశిష్టత..ప్రతీ ఏటా పిడుగు పడి ముక్కలై అతుక్కునే శివలింగం

3డీ ప్రింటెడ్ నిర్మాణంలో ఇదో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది అపూర్వమైన 3డీ ప్రింటెడ్ నిర్మాణమే కాకుండా సింప్లిఫోర్జ్ ల బృందం అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ నిర్మాణ శైలిని, సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని హరికృష్ణ వెల్లడించారు.