దారుణంగా నమోదవుతున్న పోలింగ్ శాతం

దారుణంగా నమోదవుతున్న పోలింగ్ శాతం

GHMC Election: గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు మరోసారి నిరాసక్తి చూపిస్తున్నారు. గతంతో పోలిస్తే మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సెలబ్రిటీల నుంచి ఈసీ వరకూ ఓటేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎటువంటి ప్రభావం కనిపించలేదు. ఈ మేరకు డిసెంబర్ 1 మధ్యాహ్నం వరకూ కేవలం 18.2 శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది.

2010లో గ్రేటర్ పోలింగ్ శాతం 42.92శాతం ఉండగా 2016ఎన్నికల్లో మాత్రం 45.29శాతం మాత్రమే ఉంది. దశాబ్ద కాలం నుంచి 50శాతం వరకూ నమోదు కాని పోలింగ్ శాతం ఈ సారి మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నమోదైన ఓటింగ్ శాతం వివరాలిలా ఉన్నాయి.