CM KCR : పూలబొకే వంటి భారత దేశంలో విషబీజాలు నాటుతున్నారు-కేంద్రంపై కేసీఆర్ ఫైర్

తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.

CM KCR : పూలబొకే వంటి భారత దేశంలో విషబీజాలు నాటుతున్నారు-కేంద్రంపై కేసీఆర్ ఫైర్

CM KCR : కేంద్రం తీరుపై పరోక్షంగా ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాజకీయాల కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు. అన్నీ ఉన్న ఈ దేశంలో 13 నెలల పాటు దేశ రాజధానిలో రైతులు ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు కేసీఆర్. అన్ని రంగాల్లో తెలంగాణ ముందున్నా.. తమను కేంద్రమంత్రులు తిడతారని అన్నారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత మళ్లీ ఆ మంత్రులే రాష్ట్రానికి అవార్డులు ఇస్తారని చెప్పారు.

తెలంగాణ భారత దేశంలోనే నెంబర్ 1గా ఉంది. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. రాజకీయాల కోసం కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ను, మంత్రులను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు, ఎల్లుండి ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇస్తారు. 13 నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీలో లక్షల మంది రైతులు ధర్నా చేసే పరిస్థితి ఎందుకొచ్చింది. ఏం లేదని ఈ దుస్థితి వచ్చింది. వరంగల్ పర్యటనలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ములుగు రోడ్డులో నిర్మిం‌చిన ప్రతిమ (ప్ర‌తిమ రిలీఫ్‌ ఇన్‌‌స్టి‌ట్యూట్‌ ఆఫ్‌ మెడి‌కల్‌ సైన్సెస్‌) మెడి‌కల్‌ కాలేజీ హాస్పి‌టల్‌, క్యాన్సర్‌ ఇన్‌‌స్టి‌ట్యూ‌ట్‌ను కేసీఆర్ ప్రారం‌భించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”కరెంటు లేకనా? నీళ్లు లేకనా? వసతులు లేకనా? వనరులు లేకనా? కోటి 40లక్షల జనాభా లేకనా? పని చేసే యువశక్తి లేకనా? ఏం లేదని ఈ దరిద్రం సంభవిస్తోంది. అందరినీ కలుపుకుని పోయేటటువంటి ఒక అద్భుతమైన పూలబొకే లాంటి గొప్ప భారత దేశం. సహనంతో అందరినీ కలుపుకుని పోయే ఆదరం, ప్రేమతో బతికే ఈ దేశంలో కొంతమంది దుర్మార్గులు తమ స్వార్ధ, నీచ ప్రయోజనాల కోసం విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఏ రకంగా కూడా సమర్థనీయం కాదు. ఏ రకంగానూ సమాజానికి మంచిది కాదు. మా వయసు అయిపోతోంది. భవిష్యత్తు యువతది. ఈ భారత దేశం మీది. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం కూడా మీ మీదే ఉంది” అని సీఎం కేసీఆర్ అన్నారు.