YS Sharmila: నేడు గవర్నర్‌ తమిళిసైతో భేటీ కానున్న వై.ఎస్. షర్మిల.. రేపటి నుంచి పాదయాత్ర..

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు.

YS Sharmila: నేడు గవర్నర్‌ తమిళిసైతో భేటీ కానున్న వై.ఎస్. షర్మిల.. రేపటి నుంచి పాదయాత్ర..

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై షర్మిల గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వై.ఎస్. షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

CM YS Sharmila : వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవడం ఖాయం-మాజీ ఎంపీ జోస్యం

రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్నారంటూ కేసీఆర్, కేటీఆర్ లు లక్ష్యంగా షర్మిల మాటల యుద్ధం కొనసాగిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారంటూ షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో షర్మిల గవర్నర్ ను కలుస్తుండటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

YS Sharmila Bonam : అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగిన షర్మిల

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆగస్టు 8 (సోమవారం) నుంచి వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది. అయితే షర్మిల్ గవర్నర్ తో భేటీ అయ్యేందుకు రాజ్ భవన్ కు వెళ్లాల్సి రావడంతో పాదయాత్ర సోమవారం వాయిదా పడింది. తిరిగి రేపటి (ఆగస్టు 9) నుంచి పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్నారు.