Yadadri temple : నేటి నుంచి యధావిధిగా యాదాద్రీశుని దర్శనాలు, సేవలు

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.

Yadadri temple : నేటి నుంచి యధావిధిగా యాదాద్రీశుని దర్శనాలు, సేవలు

Yadadri Tmeple

Yadadri temple : కరోనా కేసులు తగ్గుముఖం పట్టటంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తి వేసింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు. స్వామి వారి ఆర్జిత సేవల్లో కూడా పాల్గోనేందుకు భక్తులను అనుమతించారు. సెకండ్ వేవ్ వ్యాప్తి నేపధ్యంలో లాక్‌డౌన్ విధించినప్పటినుంచి భక్తులకు స్వామి వారి దర్శనాలను నిలిపి వేశారు. ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేయటంతో ఇక పూర్తి స్ధాయిలో ఆలయంలో దర్శనాలు సేవలకు భక్తులను అనుతిస్తున్నారు.

Yadadri 1

Yadadri 1

37 రోజుల తర్వాత ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.. లాక్ డౌన్ ఎత్తి వేయడంతో పాటు ఆదివారం కూడా కావడంతో స్థానికులతో పాటు నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

Yadadri 2

Yadadri 2

అయితే ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటించటం తప్పనిసరి చేశారు అధికారులు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఆలయం మొత్తాన్ని శానిటైజ్ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా తయారు చేశారు.