BJP Meeting: బీజేపీ నేతలకు తెలంగాణ రుచులు.. యాదమ్మ మోనూ ఇదే

బీజేపీ బహిరంగ సభల సందర్భంగా రాష్ట్ర నేతలతో పాటు దేశవ్యాప్తంగా కీలకమైన నేతలంతా తెలంగాణకు విచ్చేశారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ సభల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించారు.

BJP Meeting: బీజేపీ నేతలకు తెలంగాణ రుచులు.. యాదమ్మ మోనూ ఇదే

Yadamma Special Food For Pm Modi

BJP Meeting: బీజేపీ బహిరంగ సభల సందర్భంగా రాష్ట్ర నేతలతో పాటు దేశవ్యాప్తంగా కీలకమైన నేతలంతా తెలంగాణకు విచ్చేశారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పాల్గొనే ఈ సభల కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయించారు. నాన్ వెజ్‌ను దూరం పెట్టి పూర్తిగా శాకాహార వంటకాలతో మెనూ రెడి చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ తెలంగాణ వంటల రుచి చూపించబోతున్నారు.

ఈ సందర్భంగా దాదాపు 50 రకాల వంటకాల తయారీలో నిమగ్నమైనట్లు కనిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వంటకాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీసహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ దిగ్గజాలు ఈరోజు తెలంగాణ వంటకాల రుచి చూపించే అవకాశం కల్పించినందుకు బండి సంజయ్‌కు రుణపడి ఉంటానని చెప్తున్నారు యాదమ్మ.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలను ఆయా ప్రముఖులంతా టేస్ట్ చేయబోతున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్‌లోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డించాలనుకోవడం విశేషం.

Read Also: బీజేపీ సభ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు
స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం. ఇక వంటల మెనూ ఇలా ఉంది.

కూరల మెనూ

చిక్కుడుకాయ టమోటా
ఆలు కూర్మ
వంకాయ మసాల
దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై
బెండకాయ కాజు పల్లీల ఫ్రై
తోటకూర టమోటా ఫ్రై
బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై
మెంతికూర పెసరపప్పు ఫ్రై
గంగవాయిలకూర మామిడికాయ పప్పు
సాంబారు
ముద్దపప్పు
పచ్చిపులుసు
బగారా
పులిహోర
పుదీన రైస్
వైట్ రైస్
పెరుగన్నం
గోంగూరు పచ్చడి
దోసకాయ ఆవ చట్నీ
టమోటా చట్నీ
సొరకాయ చట్నీ

స్వీట్స్ విషయానికొస్తే…
బెల్లం పరమాన్నం
సేమియా పాయసం
భక్షాలు
బూరెలు
అరిసెలు

స్నాక్స్ విషయానికొస్తే…
పెసరపప్పు గారెలు
సకినాలు
మక్క గుడాలు
సర్వపిండి
టమోటా చట్నీ
పల్లీ చట్నీ
పచ్చి కొబ్బరి చట్నీ
మిర్చి