Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.

Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా

Kcr Yashwanth Sinha

Yashwant Sinha :  విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.

బేగంపేట ఎయిర్ పోర్టు నుండి జలవిహార్ వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో ఆ రూట్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్,యశ్వంత్ సిన్హా జల విహార్ కు చేరుకున్న తర్వాత  గం. 12-30  సమయంలో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వారిద్దరూ కలిసి
ప్రగతిభవన్ చేరుకుంటారు. అక్కడ యశ్వంత్ సిన్హాతో కలిసి కేసీఆర్ లంచ్ చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం గం.3-30 లకు ప్రగతిభవన్ ఎదురుగా ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్లో యశ్వంత్ సిన్హా MIM ఎంపీలు  ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం గం.4-45 కి బెంగుళూరు బయలు దేరి వెళతారు.

ఇప్పటికే బేగంపేట విమానాశ్రయం టీఆర్ఎస్ నేతలతో కిక్కిరిసిపోయింది. హోం మంత్రి మహమూద్ ఆలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాహాద్ పోలీసు కమీషనర్ సీవీఆనంద్ బేగంపేట వద్ద ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

తెలంగాణ  కాంగ్రెస్ దూరం
కాగా…..యశ్వంత్ సిన్హాతో భేటీకి తెలంగాణ కాంగ్రెస్ దూరంగా  ఉంటోంది. హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హా టీ.ఆర్.ఎస్, ఎంఐఎం నేతలను మాత్రమే కలవనున్నారు. యశ్వంత్ సిన్హా టీ.ఆర్.ఎస్ నేతలను కలవడానికి వస్తున్న నేపథ్యంలో దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ ఇంటి గడప తొక్కితే… ఈ ఇంటి గడప తొక్కనివ్వం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హా తో రేపు కానీ ఎల్లుండి కానీ ఢిల్లీలో సమావేశం కావాలని కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయించుకున్నారు.

పటిష్ట భధ్రత
మరోవైపు ఇవాళ, రేపు హైదరాబాద్ లో జరుగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో సహా పలువురు ప్రముఖులు, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా ఈరోజే హైదరాబాద్ పర్యటనలో ఉంటున్నారు. ఆయన కూడా బేగంపేట విమానాశ్రయానికే వస్తున్నారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి జలవిహార్ వరకు నిర్వహించే ర్యాలీ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుకోసం పెద్ద ఎత్తున పోలీసులను నియమించారు.

Also Read : New Tyres : అక్టోబర్ 1 నుంచి కొత్త రకం టైర్లు వాడాల్సిందే… కేంద్రం కొత్త నిబంధనలు విడుదల