Love Harassment : యువకుడి వేధింపులు..బాలిక ఆత్మహత్య

Love Harassment : యువకుడి వేధింపులు..బాలిక ఆత్మహత్య

Mumbai Lady Cop Rehana Shaikh (1)

Love Harassment In Hyderabad : ప్రేమ పేరుతో వేధింపులు..కాదంటే సాధింపులు..ఇదీ కొంతమంది యువకులు చేసే దారుణాలకు ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనే జరిగింది హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను..నన్ను పెళ్లి చేసుకో..లేదంటే మీ అమ్మానాన్నలను చంపేస్తా’అంటూ వేధిస్తున్న యువకుడి బెదిరింపులకు ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడి వేధింపులకు తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చిన ఘటన బంజారాహిల్స్ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

వివారాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఫ్రెండ్ గా భావించిన ఆ బాలిక అతనితో మాట్లాడుతుండేది. ఈక్రమంలో ఓ రోజు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా యువకుడు.దానికి ఆ బాలిక నాకు ఇష్టం లేదని చెప్పింది.దానికి అతను ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను..నన్ను పెళ్లి చేసుకోకకపోతే మీ అమ్మానాన్నల్ని చంపేస్తా’అంటూ బెదిరించాడు.

దీంతో భయపడిపోయిన ఆ బాలిక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. స్నేహితుడిగా పరిచమై..స్నేహం అనే ముసుగులో ప్రేమ పేరుతో ఆ బాలికను వేధిస్తూ..తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు మాటలతో హింసిచంటంతో మనోవేదనకు గురై ఫ్యాన్‎కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.