HYD : విదేశాల్లో ఉండి..ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయవచ్చు..విద్యార్థినుల ప్రతిభ

విదేశాల్లో ఉండి...ఇంట్లోని ఫ్యాన్, ఇతర విద్యుత్ ఉపకరణాలను స్విచ్ఛాఫ్ చేయగలిగే...హై వైఫై వస్తువును రూపొందించారు ఇద్దరు విద్యార్థినులు.

HYD : విదేశాల్లో ఉండి..ఇంట్లో ఫ్యాన్ ఆఫ్ చేయవచ్చు..విద్యార్థినుల ప్రతిభ

Smart Phone

Vijayanagar Govt School : విదేశాల్లో ఉండి…ఇంట్లోని ఫ్యాన్, ఇతర విద్యుత్ ఉపకరణాలను స్విచ్ఛాఫ్ చేయగలిగే…హై వైఫై వస్తువును రూపొందించారు ఇద్దరు విద్యార్థినులు. హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సాహిత్య, వందనలు దీనిని రూపొందించారు. స్కూల్ టీచర్ పడాల సురేశ్ కుమార్…వీరికి మార్గదర్శనం చేయగా..కెనడాలోని సీజీఐ కంపెనీకి చెందిన లెర్నింగ్ లింక్ ఫౌండేషన్ సహకారాన్ని అందించింది. ఈ ఆవిష్కరణకు హై వైఫై అనే పేరు పెట్టారు. ఇంటికి ఎ త దూరం అయినా..సరే…చివరకు విదేశాల నుంచి…అయినా..ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలను స్విచ్చాఫ్ చేయగలిగే…సామర్థ్యం ఉండడం దీని ప్రత్యేకత.

Read More : T20 World Cup: 6,6,6,6,6,6.. నలభై ఏళ్ల వయస్సులోనూ.. మాలిక్ తుఫాను ఇన్నింగ్స్!

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి వారి ఆలోచనలను స్టార్టప్ లుగా మలిచేందుకు…ఈ పాఠశాల అటల్ టింకరింగ్ ల్యాబ్ ను మంజూరు చేశారు. ఇదే ల్యాబ్ లోని పరికరాలతో ప్రయోగాలు చేసి…హై వైఫై ప్రాజెక్టును రూపొందించారు. ఇంట్లో ఉన్న సమయంలో…స్విచ్ ల జోలికి వెళ్లకుండానే…మొబైల్ ఫోన్ ఆధారంగా..ఫ్యాన్లను..లైట్లను ఆర్పవచ్చని చెబుతున్నారు. ఇంట్లో వైఫై కనెక్షన్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న స్మార్ట్ ఫోన్‌, అలెక్సా యాప్‌, కొన్ని సాప్ట్ వేర్‌లు వినియోగించి స్విచ్‌ బోర్డు తయారు చేశారు. స్మార్ట్ ఫోన్ లో అలెక్సా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని…కొన్ని రకాల సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి…హై వైఫై బోర్డును తయారు చేశారు. దీనిని ఫ్యాన్లు, లైట్లను అనుసంధానం చేస్తారు. ఈ బోర్డును అలెక్సా యాప్ తో అనుసంధానం చేయాలి. దీని ద్వారా…స్మార్ట్ ఫోన్ ఉపయోగించి…ఫ్యాన్లు, లైట్లను ఆఫ్ చేయవచ్చు.