suicide : వీడియో రికార్డు చేసి యువతి డబ్బులు డిమాండ్.. యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్ లో హనీట్రాప్ కు ఓ యువకుడు బలి అయ్యాడు. వీడియో కాల్ రికార్డు చేసి యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Suicide
Young man suicide in Hyderabad : హైదరాబాద్ లో హనీట్రాప్ కు ఓ యువకుడు బలి అయ్యాడు. వీడియో కాల్ రికార్డు చేసి యువతి డబ్బులు డిమాండ్ చేయడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని లంగర్ హౌజ్ లక్ష్మీనగర్ బస్తీలో శివ శంకర్ నాయక్ అనే యువకుడు నివాసముంటున్నాడు.
ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతితో శివ శంకర్ నాయక్ వీడియో కాల్ మాట్లాడాడు. అయితే ఆ యువతి వీడియో కాల్ రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందని భావించిన యువకుడు ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆన్ లైన్ చాటింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడి తల్లిదండ్రులు అంటున్నారు.
ఆన్ లైన్ లో తనతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు స్క్రీన్ రికార్డు చేసి డబ్బుల కోసం ఓ మహిళ బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపించారు. మృతి చెందిన యువకుడు బీ.టెక్ పూర్తి చేసినట్లు అతని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రధానంగా ఇటీవలి కాలంలో వాట్సాప్ కు సంబంధించిన న్యూడ్ వీడియో కాల్స్ కు చాలా మంది యువత అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైతే బయటి నుంచి వీడియోకు సంబంధించి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారో సదరు వ్యక్తిని రికార్డింగ్ ద్వారా బెదిరించడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని భయపెట్టడం, డబ్బులు లాగటం లాంటివి సాధారణమయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ తరహా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.