గోదావరి ఖనిలో దారుణం : కత్తులతో ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారయత్నం

గోదావరి ఖనిలో దారుణం : కత్తులతో ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారయత్నం

Young men attempt to rape a young woman : పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దారుణం చోటు చేసుకుంది. ఫోర్‌ ఇంక్లైయిన్ గడ్డ వద్ద ఓ మైనర్‌పై యువకులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కత్తులు చూపించి యువతిని బెదిరించిన యువకులు… అత్యాచారానికి యత్నించారు. భయపడిన యువతి కేకలు వేయడంతో… స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. స్థానికుల రాకతో యువకులు పారిపోయారు.

గోదావరి ఖనికి చెందిన యువతితో అదే ప్రాంతానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఫోర్‌ ఇంక్లైయిన్ గడ్డకు వెళ్లిన సమయంలో అక్కడికి మరో ముగ్గురు యువకులు చేరుకున్నారు. కత్తులతో ప్రేమజంటను బెదిరించిన యువకులు… యువతిపై అత్యాచారానికి యత్నించారు.

అదే సమయంలో యువతి కేకలు వేయడంతో స్థానికులు రావడంతో… దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.