TSRTC : అర్ధరాత్రి సజ్జనార్‌‌కు యువతి ట్వీట్

ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్...ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు...

TSRTC : అర్ధరాత్రి సజ్జనార్‌‌కు యువతి ట్వీట్

Rtc Md

Young Woman Tweet To RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్…ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు. మహిళల సమస్యలపై చేసిన ట్వీట్ కు సజ్జాన్ రెస్పాండ్ కావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలిపింది.

Read More : Warangal Rains : వరంగల్‌ను ముంచెత్తిన వాన-లోతట్టు ప్రాంతాలు జలమయం

ట్వీట్ లో ఏం ప్రస్తావించారు ? :-

రాత్రి సమయంలో మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు అవసరాల నిమిత్తం పెట్రోల్ బంక్స్ లల్లో ఓ పది నిమిషాలు ఆపితే మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. (అవసరాలు బయటికి చెప్పలేరు కాబట్టి). ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ కి కూడా ఎలాంటి భారం ఉండదని ట్వీట్ లో తెలిపారు.

Read More : Vaikunta Ekadasi 2022 : రేపు వైకుంఠ ఏకాదశి (లేదా) ముక్కోటి ఏకాదశి విశిష్టత

సంస్థ అభివృద్దికి సజ్జనార్ చర్యలు : –
ఇక సజ్జనార్ విషయానికి వస్తే…ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం అని తెలిపేందుకు ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాకుండా..తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ…ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రయాణికులు, సొంత సిబ్బంది ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మెయిల్ ఐడీని కూడా ఇచ్చారు. md@tsrtc.telangana.gov.in మెయిల్‌ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్‌ ఖాతా ద్వారా కానీ, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచేందుకు అధికారులతో సమావేశాలు నిర్వహించి వారి సలహాలు తీసుకుంటున్నారు.