YS.Sharmila: వైఎస్.షర్మిల మరోసారి అరెస్ట్.. ట్యాంక్‍బండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

ఇటీవలే వైఎస్.షర్మిలను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఆమెను మరోసారి అరెస్టు చేశారు. పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.

YS.Sharmila: వైఎస్.షర్మిల మరోసారి అరెస్ట్.. ట్యాంక్‍బండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

YS.Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలను హైదరాబాద్ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తన పాదయాత్రకు అనుమతివ్వాలని కోరుతూ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట షర్మిల దీక్ష చేపట్టారు.

BRS Party: అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం.. ఈసీ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్..

తన అనుచరులతో కలిసి దీక్షకు కూర్చున్నారు. హైకోర్టు తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పినప్పటికీ, పోలీసులు అనుమతించడం లేదని షర్మిల ఆరోపించారు. తన పాదయాత్రకు వెంటనే అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. అయితే, షర్మిల దీక్షను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్టు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. దీక్ష సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేశారు.

‘‘ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా. మా యత్రకు హైకోర్టు అనుమతి కూడా ఉంది. అయినప్పటికీ పాదయాత్రకు అనుమతించలేదు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రశ్నించే గొంతుకను కేసీఆర్ అణచివేస్తున్నారు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.