షర్మిల మరో కీలక సమావేశం, ముఖ్య నేతలతో చర్చలు

షర్మిల మరో కీలక సమావేశం, ముఖ్య నేతలతో చర్చలు

YS Sharmila : లోటస్‌పాండ్‌లో సందడి నెలకొంది. ఈ సందడి రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పలు జిల్లాల నేతలతో షర్మిల భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ స్థాపనకు విస్తృతస్థాయిలో మంతనాలు నడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌ వర్క్‌కు సంబంధించి ప్రిపరేషన్‌ను లోటస్‌పాండ్‌ వేదికగానే చేస్తున్నారు. వచ్చీ పోయే నేతలు, మాజీ అధికారులతో షర్మిల నివాసం దగ్గర రద్దీ కనిపిస్తోంది. పలు జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులు, ఇతర నేతలతో షర్మిల చర్చలు జరుపుతున్నారు. 2021, ఫిబ్రవరి 20వ తేదీ శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలు లోటస్ పాండ్ చేరుకున్నారు. 300 మంది ముఖ్యనేతలతో షర్మిల మాట్లాడుతున్నారు. పార్టీ ఏర్పాటు, కార్యచరణపై అభిప్రాయలు తెలుసుకోనున్నారు. విశేషం. 11 నుంచి 12 గంటల మధ్య బయటకు వచ్చి లోటస్ పాండ్ కు చేరుకున్న అభిమానులు, నేతలకు అభివాదం చేయనున్నారని సమాచారం. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు షర్మిల.

లోటస్ పాండ్ వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిలతో పాటు కొంతమంది నేతల ఫొటోలు ఫ్లెక్సీలో దర్శనమిస్తున్నాయి. తొలుత లోటస్ పాండ్ వద్ద షర్మిల ఫొటోతో భారీ వాల్ పోస్టర్ ఏర్పాటు చేస్తే. ఇప్పుడు దానిని మార్చారు. తెలంగాణ ఇతివృత్తం తెలిసే విధంగా ఏర్పాటు చేయడం విశేషం.

గతంలో వారానికోసారి షర్మిల బెంగళూరు వెళ్లేవారు. కానీ ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయ్యేవరకు బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని, పార్టీ ఏర్పాటుపై ఫోకస్‌ పెట్టారని తెలుస్తోంది. ఎక్కువ సేపు ఆఫీసులో ఉంటూ తనను కలుసుకోవడానికి వచ్చేవారితో సమావేశమై చర్చించేందుకు షర్మిల షెడ్యూల్‌ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్‌ ఉదయ్‌కుమార్‌ సిన్హాను నియమించిన సంగతి తెలిసిందే.