టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila comments on TRS government : టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని విమర్శించారు. రైతులు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుందా అని అడిగారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్లైంది.. పక్కా ఇళ్లు అందరికీ వచ్చాయా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరును షర్మిల ప్రాథమికంగా ఖరారు చేశారు.

మళ్లీ రాజన్న రాజ్యం రావాలన్నారు. రాజన్న రాజ్యం రావాలని అందరూ కోరకుంటున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం మనతోనే సాధ్యమని తన నమ్మకం అన్నారు. తాను తెలంగాణ కోసం అంకితభావం కృషి చేస్తానని చెప్పారు. రాజన్న సువర్ణ పాలన తెచ్చేందుకే వచ్చానని తెలిపారు. జగన్ ఏపీలో పని చేస్తున్నారని..తాను తెలంగాణకు కమిటెడ్ గా పని చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ అభిమానం చెక్కుచెదరలేదన్నారు. వైఎస్ పాలనలో రైతు రాజులా బతికాడన్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?..ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం చేయాలన్నారు.