YS Sharmila : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. 

YS Sharmila : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల

Ys Sharmila

YS Sharmila :  వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు.  మండలం లోని  కంచన్‌పల్లి గ్రామంలో దుంపల మహేష్, శ్రీకాంత్, కీసర శేఖర్‌గౌడ్ మరియు లింగంపల్లి‌లో బోన్ల శేఖర్ అనే రైతు కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతోపాటు వరి రైతులు, గ్రామస్తులు కూడా అనేకమంది వారి సమస్యలు విన్నవించారు.

వరి వద్దంటే ఉరి తప్ప మరే మార్గం లేదని రైతులు చెబుతున్నారు. వరి ఎందుకు వేసుకోవద్దో  చెప్పాలి అని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.   ప్రభుత్వం వరి కొంటుంది అనే భరోసా ఇవ్వాలి …రుణ మాఫీ చేస్తా అన్నారు..ఎంతమందికి చేశారో చెప్పాలి. బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారు….రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆమె అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ఎందుకు కట్టారో చెప్పాలని ఆమె కోరారు.

Also Read : Sathupally Tragedy : కొడుకు ఆత్మహత్యని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని ఆరోపిస్తూ ఆమె…..వరి వేయం అని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఎందుకు రాసిచ్చారన్నారు. సీఎం పాలన వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని…..ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. యాసంగి‌లో వరి పంటను కొనుగోలు చేయాల్సిందేనని…రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఆమె చెప్పారు.