Minor rape case: సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు.. వాళ్లు కేసీఆర్ ఫ్రెండ్స్ కొడుకులంటూ ఆరోపణ ..

సీఎం కేసీఆర్ ఫై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అదినేత్రి షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో అసలైన నిందితులను తప్పించేలా ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ మిత్రుల కుమారులకు ఈ ఘటనలో ప్రమేయం..

Minor rape case: సీఎం కేసీఆర్‌పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు.. వాళ్లు కేసీఆర్ ఫ్రెండ్స్ కొడుకులంటూ ఆరోపణ ..

Ys Sharmila

Minor rape case: సీఎం కేసీఆర్ ఫై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అదినేత్రి షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో అసలైన నిందితులను తప్పించేలా ప్రయత్నిస్తున్నారని, కేసీఆర్ మిత్రుల కుమారులకు ఈ ఘటనలో ప్రమేయం ఉండం వల్ల వారి పేర్లు బయటకు రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఇదేనా బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం అంటూ శనివారం తన ట్విటర్ ఖాతాలో షర్మిల్ పోస్టు చేశారు.

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కారులో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్‌ నుంచి ఇంట్లో దింపేస్తామంటూ కారు ఎక్కించుకున్న ఐదుగురు దుండగులు.. నిర్మానుష్యమైన గల్లీల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన మే 28న జరిగింది. అయితే ఇంటికి వెళ్లిన బాలిక ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో తనను కొందరు వేధించారని చెప్పడంతో మే 31న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసుపై దర్యాప్తు జరపగా అసలు విషయం బయటకు వచ్చింది. సదరు బాలికపై సామూహిక హత్యాచారం చేశారని గుర్తించారు. వీరిలో పలువురు ప్రముఖుల కుమారులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని, అయితే కావాలని అతడి పేరును తప్పించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Jubilee Hills GangRape Issue : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. హోంమంత్రి మనవడికి క్లీన్ చిట్

ఈ క్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై.ఎస్. షర్మిల ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆరేండ్ల పాపకు, పదహారేండ్ల అమ్మాయికి, అరవై ఏండ్ల బామ్మకు రక్షణ లేదు కేసీఆర్ రాజ్యంలో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులైనా నిందితులను పట్టుకునే దిక్కులేదని, ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దురుకుతుందా? గ్యాంగ్ రేపులో టీఆర్ఎస్ నాయకుల బంధువులు, మిత్రపక్షం ఎమ్మెల్యేల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం అంటూ షర్మిల ప్రశ్నించారు. ఇదీ బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవం, రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ, డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మారుస్తూ ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేసి కేసీఆర్, ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.