CM KCR-YS Sharmila : కేసీఆర్‌పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్

CM కేసీఆర్‌పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో షర్మిల భేటీ కానున్నారు. ఈ భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్ ఉందనే ప్రచారం జరుగుతోంది.

CM KCR-YS Sharmila :  కేసీఆర్‌పై ఫిర్యాదు చేయటానికి ఢిల్లీకి YS షర్మిల .. కేంద్రమంత్రులతో భేటీ వెనుక పొలిటికల్ ప్లాన్

KCR-YS Sharmila

KCR-YS Sharmila : తెలంగాణలో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే పాదయాత్ర చేపట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ పాదయాత్ర పొడవునా..సీఎం కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై కూడా విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ అవినీతిపరుడనీ..ప్రజలను మాయం చేస్తు భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు షర్మిల. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అటు కేసీఆర్..ఇటు టీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల బీజేపీ పార్టీపై ఒక్క విమర్శ కాదుకదా..ఒక్క మాటకూడా అనటంలేదు. ఈక్రమంలో షర్మిల టీఆర్ఎస్ ను ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని.. వేల కోట్లు సంపాదించారని పాదయాత్రలో విమర్శిస్తూ వచ్చారు.

ఈక్రమంలో కేసీఆర్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. దీంట్లో భాగంగానే షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం (అక్టోబర్ 7,2022)న ఢిల్లీ వెళ్లనున్నారు. 7న కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవ్వనున్నారు. కేసీఆర్ అవినీతి చేశారని దానిపై విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే షర్మిల గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి మరోసారి ఫిర్యాదు చేయటానికి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై సిబిఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరనున్నట్లుగా సమాచారం.

షర్మిల ఢిల్లీ వెళ్లటం వెనుక ఆసక్తి కర రాజకీయం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్న క్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ ప్రకటన వేళ.. షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ పార్టీ స్థాపించిన షర్మిల పాదయాత్రలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తు పలు విమర్శలు సంధిస్తున్నారు. ఇప్పటికే 2500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల అక్టోబర్ 7న ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ ఏర్పాటు తరువాత షర్మిల ఈ సమయంలో ఢిల్లీ వెళ్లటం రాజకీయంగా అనేక చర్చలకు కారణమవుతోంది. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీలో కీలక నేతల చేరికలు లేవు. షర్మిల వాయిస్ ఒక్కటే పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు – టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును టార్గెట్ చేస్తూ షర్మిల ప్రజల్లోకి వెళ్తున్నారు.

అదే సమయంలో పదే పదే కేసీఆర్ పాలనలో అవినీతి గురించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన కోసం షర్మిల ఈ రోజు – రేపు తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి 8వ తేదీన కామారెడ్డి జిల్లా నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కేసీఆర్ పాలనలో అవినీతి పైన ఢిల్లీ పెద్దలతో పాటుగా కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసేందుకే షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటనలో షర్మిల అమిత్ షా తో కూడా భేటీ కానున్నట్లుగా సమాచారం.

షర్మిలకు ఢిల్లీ రావాలంటూ ఆహ్వానం అందింది అని అందుకే ఆమె ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. షర్మిల ఢిల్లీ వెళ్తున్నారనే అంశం మినహా..ఇతర విషయాలు మాత్రం బయటకు రావటంలేదు. కేసీఆర్ ప్రభుత్వం పై ఇప్పటికే బీజేపీ చేసిన ఆరోపణలనే ఇప్పుడు షర్మిల కొనసాగిస్తున్నారు. అంటే షర్మిల బీజేపీతో దోస్తీకి సై అంటున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల ఫిర్యాదుల ఆధారంగా కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని..దీంతో షర్మిల పర్యటన రాజకీయంగా తెలంగాణలో కొత్త సమీకరణాలకు కారణం కానుందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులతో పాటు, కాలేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సీబీఐ విచారణ జరపాలని షర్మిల కోరనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.