YS Sharmila: ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల

YS Sharmila: ఉద్యోగ దీక్ష విరమించిన వైఎస్‌ షర్మిల

Ys Sharmila

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఉద్యోగ దీక్ష వైఎస్‌ షర్మిల విరమించారు. ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో గురువారం 72 గంటల ఉద్యోగ దీక్షను షర్మిల ప్రారంభించగా.. సాయంత్రం 5 గంటల వరకే పోలీసులు అనుమతి ఇవ్వడంతో తన దీక్షా వేదికను లోటస్ పాండ్‌కు మార్చుకున్న షర్మిల.. అక్కడ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 72గంటల తర్వాత ఈరోజు షర్మిల తన దీక్షను విరమించారు.

షర్మిల దీక్షా శిబిరానికి వైఎస్‌ అభిమానుల తాకిడి కొనసాగగా.. అభిమానుల మధ్య అమరవీరుల కుటుంబాలు నిమ్మరసం ఇవ్వగా ఆమె దీక్ష విరమించారు. ఈ సంధర్భంగా.. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మీ రాజకీయాల కోసం జిల్లాలు విభజన చేస్తే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. నాకు అర్థం అవుతోంది.. తల్లిదండ్రుల క్షోభ.. ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం ఎంతుకు భర్తీ చెయ్యలట్లేదు,. అంటూ నిలదీశారు.

మాట మీద నిలబడే రాజన్నకు బిడ్డగా.. నేను నిలబడుతా.. మిమ్మల్ని నిలబెడుతా అని అన్నారు. కానిస్టేబుళ్లు తప్ప ఏ నియామకం ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడ్డాక జరగలేదని, ఏడేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవని, ఒక్కసారికి ఏడేళ్లు ఏజ్ లిమిట్ కూడా పెంచాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ స్పందించకుండా.. ఇలాగే కాలయాపన చేస్తే.. నిరాహార దీక్షలే కాదు.. అంతకు మించి పోరాటాలు చెయ్యడానికి మేం సిద్ధంగా ఉన్నాం అని అన్నారు షర్మిల