YS Sharmila Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల కామెంట్స్

ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు.

YS Sharmila Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల కామెంట్స్

Ys Sharmila Revanth Reddy

YS Sharmila Revanth Reddy : ఓ టీడీపీ నేతను తెచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ పెట్టబోతున్నామన్నారు. పార్టీకి నాయకులు, కార్యకర్తలు ఎంత ముఖ్యమో సోషల్ మీడియా వారియర్స్ కూడా అంతే ముఖ్యమన్నారు షర్మిల.

”తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడం కోసం మనం పార్టీ పెట్టబోతున్నాం. నాయకులు, కార్యకర్తలు ఎంత ముఖ్యమో పార్టీలకు సోషల్ మీడియా వారియర్స్ కూడా అంతే ముఖ్యం. టీఆర్ఎస్ పార్టీకి వేలాది మంది సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారు. ఆఖరికి ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. ఆఖరికి ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారు” అని షర్మిల అన్నారు.

అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవ సంద‌ర్భంగా వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమ‌న్న ఆమె.. అవన్నీ చేయలేనివి చేసేదే 5th ఎస్టేట్ అన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం సోషల్ మీడియా అని చెప్పారు. అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ చెప్పిన ఆమె.. జులై 8న కొత్త పార్టీ ప్రకటన ఉంటుంద‌న్నారు. విద్య, వైద్యం ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందించాలన్న‌దే త‌న ధ్యేయ‌మ‌న్నారు. అన్ని కులాలు, మ‌తాల‌కీ అతీతంగా పార్టీ ఉంటుంద‌ని చెప్పారు. ఇలాంటివన్నీ చేయాలంటే సోషల్ మీడియా అవసరం ఎంతో ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

నెటిజ‌న్ల స‌పోర్ట్ లేకుండా తానేమీ చేయలేనని షర్మిల అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె కొన్ని పొలిక‌ల్ డైలాగ్స్ కూడా పేల్చారు. టీఆర్ఎస్‌కు సోషల్ మీడియాకు ఎంప్లాయిస్ ఉన్నారు. ఆఖరికి టీడీపీ నేతను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిని చేసిన దుస్థితి కాంగ్రెస్ ది. అలాంటి పార్టీకి కూడా సోషల్ మీడియా ఎంప్లాయిస్ ఉన్నారు. కానీ మనకు కార్య‌కర్త‌లు, వైఎస్సార్ అభిమానులే సైన్య‌మ‌న్నారు షర్మిల.